VAHANAM BEARERS, RELIGIOUS AND SANITARY STAFF FELICITATED _ ఆల‌య సిబ్బందికి వ‌స్త్రబ‌హుమానం

TIRUMALA, 05 OCTOBER 2022: TTD Chairman Sri YV Subba Reddy along with EO Sri AV Dharma Reddy felicitated 2500 employees which included Vahanam bearers, melam staff, religious and sanitary staff who strived day and night towards the successful conduct of annual Brahmotsavams.

This event was held at Vaibhavotsava Mandapam.

The TTD board members have contributed Rs. 64lakhs to felicitate these strong workforce who did impeccable services. Besides, Smt Vemireddi Prasanthi Reddy, LAC Chief of New Delhi has donated Rs. 40lakhs towards vastra Bahumanam to all these employees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆల‌య సిబ్బందికి వ‌స్త్రబ‌హుమానం

వాహనంబేరర్లకు కానుకగా రూ.64.50 లక్షలు

తిరుమల, 2022 అక్టోబరు 05: బ్ర‌హ్మోత్స‌వాల్లో విధులు నిర్వ‌హించిన వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బంది, వేద‌పారాయ‌ణ‌దారులు, జియ్యంగార్ల శిష్య బృందం, పారిశుద్ధ్య కార్మికులు త‌దిత‌ర 2500 మంది సిబ్బందికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి చేతుల‌మీదుగా వ‌స్త్రబ‌హుమానం అందించారు. ఆల‌యం వ‌ద్ద గ‌ల వైభ‌వోత్స‌వ మండ‌పంలో బుధ‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి దంప‌తులు రూ.40 లక్షల వ్యయంతో ఈ మేర‌కు ఈ వ‌స్త్రాల‌ను అంద‌జేశారు.

అదేవిధంగా, టిటిడి ఛైర్మ‌న్‌తోపాటు బోర్డు స‌భ్యులు క‌లిసి రూ.64.50 లక్షలను వాహ‌నం బేర‌ర్ల‌కు కానుకగా అందించారు. ఒక్కో వాహనం బేరర్ కు రూ.81,500/- కానుకగా అందింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.