VAHANAMS SERIES CONCLUDES WITH ASWA _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

TIRUPATI, 17 NOVEMBER 2023:The series of Vahana Sevas concluded with Aswa Vahanam on the penultimate day of the annual Karthika Brahmotsavams in Tiruchanoor on Friday evening.

 

Sri Padmavathi Devi in Kalki Avataram blessed Her devotees on the Aswa Vahanam.

 

Both the Pontiffs of Tirumala, Chairman Sri Karunakara Reddy, JEO Sri Veerabrahmam and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి, 2023 నవంబర్ 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి అమ్మవారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు.

రాత్రి 7 నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీమతి సీతారెడ్డి, శ్రీ దేశ్ పాండే, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.