VAIKHANASA AGAMA VIDWAT CHARCHA GHOSTI _ వైఖానస విద్వత్ చర్చాగోష్ఠి ప్రారంభ సభ
Tirupati, 28 Jan 09: Seminar on Vaikhanasa Agamam need to be conducted across the country told Sri D.K.Audikesavulu, Chairman TTDs. He addressed the pundits on the inaugural session of Vaikhanasa Vidwat Charcha Ghosti held at SVETA Bhavan, Tirupati on Jan 28.
Speaking on this occassion the Chairman said that irrespective of all caste, everyone should be treated equally and there should be only one govindam i.es Bhaja Govindam he added. Only Lord Govinda is universal God he said.
Speaking on this occassion, Sri K.V.Ramanachary, Executive Officer, TTDs appealed the pundits to give suggestion on Archakatvam. He further said that, the TTD is also giving training to the Archakas on Pancharatra, Vaikhanasa, Saiva, Smartha Agamas acorss the state besides Girijan Goravas and fishermen.
The Agama Charcha Ghosti will be conducted for three days from Jan 28 to 3o.
Prof. Sudharshana Sarma, Vice-Chancellor, S.V.Vedic University, Vedantham Vishnu Bhattacharyulu, Sri Sundaravarada Bhattacharyulu, Sri Vedantha Desikacharyulu and others have participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
వైఖానస విద్వత్ చర్చాగోష్ఠి ప్రారంభ సభ
తిరుపతి, జనవరి-28,2009: వైఖానస ఆగమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా పలురాష్ట్రాలలో, పండితులతో చర్చాగోష్ఠులను నిర్వహించాల్సిన అవసరం వుందని తి.తి.దే పాలకమండలి ఛైర్మెన్ శ్రీడి.కె.ఆదికేశవులు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక శ్వేతనందు జరిగిన వైఖానసవిద్వత్ చర్చాగోష్ఠి ప్రారంభ సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ వైఖానస ఆగమ పరిరక్షణకు ఇలాంటి చర్చాగోష్ఠులు అనేకం జరగాలని, తద్వారా పూజా విధానంపైన, దైవభక్తిని నేటి యువతలో పాదుకొల్పవచ్చునని ఆయన అన్నారు. భగవంతుని ముందు అందరూ సమానమేనని, ఈ గోవిందుడు అందరివాడు అని, అందుకే అందరూ ఏకమై భజగోవిందమును స్మరించాలి తద్వారా అందరిలో సమానత తీసుకురావడానికి అవకాశముందని చెప్పారు. తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి మాట్లాడుతూ లోపాలతో నిర్వహించే పూజావిధానాన్ని సవరించుకోవడానికి పండితులు సలహాలు ఇవ్వాలని, ఆగమోక్తంగా అర్చనావిధానం ఎలా చేయాలి అన్నది నేటి యువతకు తెలియజేయాలని ఆయన పండితులను కోరారు. తి.తి.దేకి చెందిన శ్వేతనందు మత్స్యకారులకు, గిరిజన గొరవలుకు పూజావిధానంపై శిక్షణ ఇవ్వడం జరిగిందని, అదే విధంగా ఆయా దేవాలయాలలో జరిగే అర్చక విధానాన్ని గురించి చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ శ్రీభూమన్, తి.తి.దే ఆగమ సలహాదారు శ్రీవేందాతం విష్ణుభట్టాచార్యులు, వేదవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, వేదాంతం దేశికాచార్యులు ప్రసగించగా, వందలాదిమంది పండితులు పాల్గొన్నారు. ఈ సదస్సు (చర్చాగోష్ఠి) జనవరి 28 నుండి 31 వరకు జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.