VAIKUNTA DWARA DARSHAN ENTHRALLED DEVOTEES OF BACKWARD CLASSES- SAMARASATA SEVA FOUNDATION SECRETARY SRI TRINATH _ వైకుంఠ ద్వార దర్శనంతో భక్తుల తన్మయత్వం

Tirumala, 04 January 2023:   As part of its agenda to propagate Sanatana Hindu dharma TTD has provided Vaikunta Dwara Darshan to 9300 underprivileged devotees from 190 remote villages of Andhra Pradesh during Vaikuntha Dwara Darshanam.

Disclosing this Sri  Trinath, Secretary of Samarasata Seva foundation said on Wednesday that TTD has commenced this practice to facilitate underprivileged devotees since last two years for Srivari Brahmotsavam and Vaikuntha Dwara Darshans.

He said with the goal to spread Satana Hindu Dharma and contain religious conversions, TTD took up the program to build Srivari temples across the state of Andhra Pradesh as well in coordination with the state endowment department and the SS foundation.

He said 80% of these underprivileged devotees are brought from the areas where these temples were built. They were accommodated at PAC-2. Besides Srivari Darshan and laddus, they were also facilitated with Sri Padmavati Ammavaru Darshan at Tiruchanoor.

In all, 9300 underprivileged devotees are being provided Srivari Vaikunta Darshan from January 3- 9  in a phased manner. On January 3, in all 1370 Devotees from districts of YSR, Annamaiah and Tirupati had Darshan. On January 4, about 1270 devotees from Guntur, Palnadu, Bapatla and Prakasam districts.

740 devotees from Eluru, Krishna, NTR, West Godavari districts on January 5, 980 devotees from Kurnool, Nandyal and Anantapur on January 6. 1130 devotees from Rampachodavaram, East Godavari, Kakinada and Konaseema districts.

On January 8, about 1130 devotees are scheduled to visit Tirumala from Alluri Seetharama Raju, Visakhapatnam, and Anakapalli district.

Similarly, 2670 devotees are scheduled to come from Parvatipiram, Srikakulam, Vizianagaram, Sr Satya Sai,  Chittoor, Nellore districts on January 9.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠ ద్వార దర్శనంతో భక్తుల తన్మయత్వం

– వెనుకబడిన పేదవర్గాల భక్తులకు దర్శనం

– ఉచితంగా రవాణా సదుపాయం, వసతి

– రాష్ట్రం నలుమూలల్లోని 190 గ్రామాల నుండి రాక :
సమరసత సేవా ఫౌండేషన్‌ కార్యదర్శి శ్రీ త్రినాథ్‌

తిరుమల, 2023 జనవరి 04: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనేది ప్రతి హిందువు కోరిక. మన రాష్ట్రంలోనే ఉన్నా వ్యయ ప్రయాసలకోర్చి స్వామివారిని దర్శించుకోలేని పరిస్థితి వారిది. అలాంటి వెనుకబడిన పేదవర్గాల భక్తులకు టిటిడి రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోని 190 గ్రామాల నుండి సుమారు 9300 మంది ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి ఆహ్వానించినట్టు సమరసత సేవ ఫౌండేషన్‌ కార్యదర్శి శ్రీ త్రినాథ్‌ తెలిపారు.

సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవ ఫౌండేషన్‌ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆలయాలు నిర్మించిన వెనుకబడిన ప్రాంతాల నుండి పేదవర్గాల వారిని ఆహ్వానించి ఉచితంగా రవాణా, వసతి కల్పించి శ్రీవారి దర్శనం చేయిస్తోంది. వీరిలో 80 శాతం భక్తులు తొలిసారి శ్రీవారి దర్శనం చేసుకుంటుండడం గమనించదగిన విషయం. బస్సుల్లో తిరుమలకు తీసుకొచ్చి పిఏసి-2లో బస ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా భక్తులు దర్శించుకుంటున్నారు.
జనవరి 3 నుండి 9వ తేదీ వరకు 7 రోజుల పాటు సుమారు 9300 మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.

జనవరి 3న వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, తిరుపతి జిల్లాల నుండి 1370 మంది, జనవరి 4న గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుండి 1270 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

జనవరి 5న ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌, పశ్చిమగోదావరి జిల్లాల నుండి 740 మంది, జనవరి 6న కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల నుండి 980 మంది, జనవరి 7న రంపచోడవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల నుండి 1130 మంది, జనవరి 8న అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుండి 1130 మంది, జనవరి 9న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుండి 2670 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.