VAIKUNTHANADHA ON PEDDA SESHA _ పెద్దశేష వాహనంపై వైకుంఠనాధుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కటాక్షం

TIRUPATI, 17 JUNE 2024: The vahana sevas during the ongoing annual Brahmotsavam at Appalayagunta commenced with Pedda Sesha Vahanam on Monday evening.

Sri Prasanna Venkateswara as Vaikunthanatha accompanied by His two consorts Sridevi and Bhudevi took out a divine ride on the five-hood serpent king vahanam.

DyEO Sri Govindarajan, AEO Sri Ramesh, devotees were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పెద్దశేష వాహనంపై వైకుంఠనాధుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కటాక్షం

తిరుపతి, 17 జూన్ 2024: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సోమవారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వైకుంఠనాధుడి అలంకారంలో భక్తులను క‌టాక్షించారు.

ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.

వాహన సేవలో డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈఓ శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.