Valedictory function of Training Classes in “IDOL WORSHIP” for members of Fishermen community _ మత్స్యకారులకు పూజావిధానంపై శిక్షణాశిబిరం ముగింపు సమావేశం
Tirupati, 6 Aug 2009: Valedictory function of Training Classes in “IDOL WORSHIP” for members of Fishermen community at SVETA Bhavan, Tirupati on Aug 6. Sri Chavireddy Bhaskar Reddy, TTD Board Member and Chairman of TUDA has presented certificates and pancha patras to the trainees.
SVETA Director Sri Bhuman, Prof. K.J.Krishnamurthy, Spl Officer, Tarigonda Vengamamba Project were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మత్స్యకారులకు పూజావిధానంపై శిక్షణాశిబిరం ముగింపు సమావేశం
తిరుపతి, ఆగష్టు -6, 2009: భగవంతుడివైపు మనం మంచి ఆలోచనతో నడిస్తే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు శక్తిని ఇస్తాడని తుడా అధ్యకక్షులు, తితిదే పాలకమండలి సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం స్థానిక శ్వేతలో జరిగిన పూజావిధానంపై మత్స్యకారుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో అనేక దేవాలయాలు దూపదీపనైవేద్యములకు నోచుకోకుండా వున్నవని, వాటికి సంబంధించిన సదరు గ్రామస్థులు, తదితరులు ఇది తమ పనికాదని, కేవలం ప్రభుత్వమో, మరెవరో చేయాల్సిన పని అని భావించరాదని, వారికి వారే గ్రామస్థుల పరస్పర సహకారంతో ఆలయ అభివృద్దికి కృషి చేయాల్సిన అవసరం వుందన్నారు. ఎందుకంటే ఏగ్రామంలోనైనా ఆలయానికి మూడు పూటలా నైవేద్యం పెడుతారో ఆగ్రామం సమృద్దిగా వుంటుందని తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న విద్య అందరికీ అందాలన్నా, మీరు ప్రత్యేక వ్యక్తులుగా గుర్తింపు పొందాలన్నా, నేర్చుకున్న విషయాలు ఎంతో నిబద్దతతో పాటించాలని ఆయన హితవు పలికారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలు పదిమందికి పంచడమేగాక, ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేయడానికి కృషిచేయాలని వారిని కోరారు.
శ్వేత డైరెక్టర్ భూమన్ మాట్లాడుతూ ప్రస్తుతం 40 మంది మత్స్యకారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. వీరంతా పశ్చిమ,తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చారని తెలిపారు. అనంతరం శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శిక్షణ తీసుకుంటున్న వారికి శ్రీవారి ఫోటో, పుస్తకాలు, క్యాసెట్లు, వస్త్రములు బహుకరించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.