VARAHA JAYANTHI OBSERVED _ తిరుమలలోశాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి
Tirumala, 25 August 2025: The annual Varaha Jayanti was observed with spiritual fervour in Tirumala on Monday.
Abhishekam was performed to the presiding deity of Sri Bhu Varaha Swamy in the temple located adjacent to Swamy Pushkarini.
Temple DyEO Sri Lokanatham and other temple officials, priests participated in this fete.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి
తిరుమల,2025 ఆగస్టు 25: ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేపట్టారు. అనంతరం వేదమంత్రాల నడుమ మూలవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.


