VARAHARCHANA PERFORMED _ వసంత మండపంలో శాస్త్రోక్తంగా వరాహార్చన
TIRUMALA, 30 AUGUST 2022: In connection with Varaha Jayanti, Varaha Archana was performed with religious fervour in Vasanta Mandapam at Tirumala on Tuesday evening.
Vaikhanasa Agama Advisor Sri Mohana Rangacharyulu said, Sri Varaha Swamy was the third incarnation among Dasavataras of Sri Maha Vishnu.
He took the wild boar form to save Mother Earth from demonic forces and safeguarded the lives of all creatures.
On this auspicious occasion, the entire mandapam was decked with flowers and a structure of Sri Bhu Varaha Swamy was arranged.
Later the priests performed Varaha Sahasra Nama Archana and Varaha Gayatri Mantram to the Utsava deity of Sri Varaha Swamy.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వసంత మండపంలో శాస్త్రోక్తంగా వరాహార్చన
తిరుమల, 2022 ఆగస్టు 31: వరాహ జయంతిని పురస్కరించుకుని తిరుమల వసంత మండపంలో మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా వరాహార్చన జరిగింది.
ఈ సందర్భంగా వసంత మండపాన్ని సంప్రదాయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. శ్రీ భూవరాహస్వామివారి ప్రతిమను ఏర్పాటు చేశారు. శ్రీ వరాహ స్వామి వారి ఉత్సవమూర్తిని స్వర్ణ ఆభరణాలతో చక్కగా అలంకరించారు. మంగళ ధ్వనితో కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు దశావతారాల విశిష్టతను తెలియజేశారు. దశావతారాల్లో మూడవది వరాహావతారమని, లోక క్షేమం కోసం రెండుసార్లు స్వామివారు అవతరించారని తెలియజేశారు.
ముందుగా సంకల్పంతో కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రార్థన సూక్తం, వరాహ సహస్రనామార్చన, వరాహ గాయత్రి మంత్రం పఠించారు. అనంతరం నివేదన, మంగళహారతితో ఈ కార్యక్రమం ముగిసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.