VARALAKSHMI VRATAM ON AUGUST 5 _ ఆగస్టు 5న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
TIRUPATI, 15 JULY 2022: The Vara Lakshmi Vratam in Tiruchanoor Sri Padmavathi temple is scheduled on August 5.
The devotees shall pay Rs. 1,001/- on which two persons shall participate in the fete that takes place in Asthana Mandapam between 10am and 12noon.
In the evening the processional deity of Sri Padmavathi Ammavaru will be paraded on Golden Chariot along the four Mada streets.
TTD has cancelled Abhishekam, Abhisheka Anantara Darsanam, Lakshmi Pooja, Kalyanotsavam, Sahasra Deepalankara Seva and Break Darshan on that day.
The Varalakshmi Vratam tickets will be allotted both in online and in offline.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
ఆగస్టు 5న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
తిరుపతి, 2022 జులై 15: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. ఇందుకోసం రూ.1,001/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.
తిరుచానూరులోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, బ్రేక్ దర్శనాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ వ్రతం టికెట్లను త్వరలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.