VARIOUS MYTHO- INCARNATIONS CAPTIVATES IN FLOWER EXPO _ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్ప ప్రదర్శనశాల
TIRUPATI, 22 NOVEMBER 2025: The flower exhibition, set up by TTD in the Friday Gardens of Tiruchanoor as a part of ongoing annual Karthika Brahmotsavams, alluring devotees with its unique mythological themes.
The floral dioramas of Bhrigu – Maha Vishnu in milk ocean, Srirama, Sita and the golden deer, Srirama killing Ravanasura, Emergence of Sita Devi from earth, Padmavati Srinivasa, Asta Lakshmi, Srimannarayana have been captivating devotees to a great extent.
Besides the various fauna, aves apart from Gajendra Moksham sand art are attracting devotees.
The expo by SV Ayurveda, with a series of Ayurvedic medicines, also impressed the devotees.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్ప ప్రదర్శనశాల
తిరుపతి, 2025 నవంబరు 22: శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇందులో టీటీడీ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో ‘ పాల కడలిలో ఉన్న శ్రీమహావిష్ణువును కాలితో తన్నుతున్న బృగు మహర్షి, బలి చక్రవర్తి శిరస్సుపై కాలు మోపుతున్న వామనుడి రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు, రామలక్ష్మణులను తీసుకెళుతున్న హనుమంతుడు, నరకాసురుని వధిస్తున్న సత్యభామ సమేత శ్రీ కృష్ణుడు ప్రతిమలు ఏర్పాటు చేశారు.
ఆకాశరాజు భూమిని చదును చేస్తుండగా పద్మావతీ ఉద్భవం, శ్రీరామచంద్రమూర్తిని బంగారు లేడిని అడుగుతున్న సీతాదేవి, చిన్ని కృష్ణుడి లీలలు, అష్ట లక్ష్ములు తదితర ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.
వివిధ పుష్పాలు, కూరగాయలతో ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి శ్రీనివాసులు, శ్రీమన్నారాయణుడు, జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను కట్టిపడేస్తున్నాయి.
గజేంద్రమోక్షం, సైకిత శిల్పం, పుష్పాలతో రూపొందించిన అశ్వాలు, ఏనుగుల సెట్టింగులు భక్తులను కనువిందు చేస్తున్నాయి.
అదేవిధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఎక్స్‌పో ఆయు, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఏర్పాటు చేసిన శిల్ప కళ ప్రదర్శనశాల భక్తులను ఆకట్టుకుంటోంది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి శనివారం వరకు లక్షకు పైచిలుకు భక్తులు ఫ్రైడ్ గార్డెన్ లోని ఫలపుష్ప ప్రదర్శనశాలను సందర్శించారు. అక్కడి ఫలపుష్ప ప్రతిమలతో భక్తులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడడం గమనార్హం.








