VASANTHOTSAVAM BEGINS AT TIRUCHANOOR TEMPLE _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

Tiruchanoor, 25 May 2021: The celebrations of the annual Vasantothsavams commenced in Ekantam in Sri Padmavati temple at Tiruchanoor as per COVID-19 guidelines.

As a part of festivities, the utsava idol of Sri Padmavati Ammavaru was offered Snapana Tirumanjanam at the Ashirvada Mandapam in the afternoon followed by Veda parayanam and procession inside the temple amidst Mangala vaidyam.

Temple DyEO Smt Kasturi Bai, Agama Advisor Sri Srinivasacharyulu, AEO Sri Prabhakar Reddy, temple archaka Sri Babu Swamy, Superintendent Sri Madhu and other staffs were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2021 మే 25: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మంగ‌ళ‌వారం ప్రారంభమయ్యాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

వసంతోత్సవాల్లో భాగంగా మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలోని వేద ఆశీర్వాద మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అలాగే సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు వేద పారాయ‌ణం, మంగళ వాయిద్యాలు, రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి క‌స్తూరి బాయి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ మ‌ధు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.