VASANTOTHSAVAM ENTERS THE SECOND DAY _ శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు
Tirupati, 30 May 2021: The annual Vasantothsavams of Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram entered the second day on Sunday and was observed in Ekantam as per Covid guidelines.
As part of the festivities, Snapana Tirumanjanam was performed for the utsava idols of Sri Kalyana Venkateswara Swamy and His consorts Sri Bhudevi and Sri Devi in the afternoon.
Temple DyEO Smt Shanti, AEO Sri Dhananjayudu Superintendent Sri Changalrayulu temple archakas and other staff were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు
తిరుపతి, 2021 మే 30: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
కాగా వసంతోత్సవాల్లో చివరి రోజైన సోమవారం మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారికి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.