VEDAS IN MODERN MEDICINE _ వేద‌ప్రామాణికంగా న‌డిస్తేనే జ‌గ‌త్తు సుభిక్షం : స్విమ్స్ డీన్ డా.అల్లాడి మోహ‌న్‌

TIRUMALA, 17 OCTOBER 2023: Vedas prescribed the balanced diet several thousands of years ago for the benefit of humanity, said SVIMS Dean Dr Alladi Mohan.

Speaking Vedas in modern Medicine as a part of VedaVidwat Sadas in Nada Neerajanam on Tuesday, the renowned specialist doctor quoted several examples of the remedies mentioned in Vedas for chronic diseases by Sages and related them to modern medical treatment.

SVIHVS Special Officer Dr Vibhishana Sharma was also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

వేద‌ప్రామాణికంగా న‌డిస్తేనే జ‌గ‌త్తు సుభిక్షం : స్విమ్స్ డీన్ డా.అల్లాడి మోహ‌న్‌

తిరుమల, 2023 అక్టోబ‌రు 17 ;వేద‌ప్రామాణికంగా జ‌గ‌త్తు న‌డ‌వాల‌ని, అప్పుడే సుభిక్షంగా, స‌స్య‌శ్యామ‌లంగా ఉంటుంద‌ని స్విమ్స్ డీన్ డా.అల్లాడి మోహ‌న్‌ పేర్కొన్నారు. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమ‌ల‌లోని నానీరాజ‌నం వేదిక‌పై జ‌రుగుతున్న శ్రీ‌నివాస వేద విద్వ‌త్ స‌ద‌స్సులో మంగ‌ళ‌వారం ఆయ‌న‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా.అల్లాడి మోహ‌న్ “వేదంలో ఆధునిక వైద్యం” అనే అంశంపై ఉప‌న్య‌సిస్తూ, భార‌త‌దేశంలో వేల సంవ‌త్స‌రాల నుండి వేద విజ్ఞానం ప‌రిఢ‌విల్లుతోంద‌న్నారు. ఇలాంటి వేద విజ్జానాన్ని విశ్వ‌వ్యాప్తం చేయ‌డానికి టీటీడీ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తోంద‌ని చెప్పారు. వేదాల‌లో చెప్పిన విధంగా ఆహార అల‌వాట్లు అవ‌లంబిస్తే శ‌రీర‌క‌, మాన‌సిక ఆరోగ్యం బాగుంటుంద‌న్నారు. వేదాల్లో మాన‌వాళికి ఉప‌యోగ‌ప‌డే అనంత‌మైన ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయ‌న్నారు. ఇందులో కుష్ఠు వ్యాది ఎలా వ‌స్తుంది, దాని నివార‌ణ, క్రిమివినాశ‌క మంత్రాలు త‌దిత‌ర అంశాలు ఆయ‌న వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.