VEENADHAARI SWAYS IN STYLE ON HAMSA VAHANAM _ హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Tirumala, 1 Oct. 19: On the second day evening of the ongoing annual Brahmotsavams Lord Malayappaswamy is taken out in procession on Hamsa (Swan) as his carrier in the attire of Goddess Saraswathi, holding Veena in both the hands. 

Hamsa or swan means ‘pure’. Hamsa is believed to have a high intellectual capability and can distinguish the good from the bad. Because of this capacity, Hamsa is also symbolized as the vehicle of Goddess Saraswathi-the deity of wisdom. 

By riding on Hamsa Vahanam Lord sent a message that He is the supreme God of learning and also the significance of education in turning around one’s life. 

TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI  

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

 అక్టోబరు 01, తిరుమ‌ల‌, 2019: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో వీణ ధ‌రించి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

వాహనసేవల‌లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ పృథ్విరాజ్, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు పాల్గొన్నారు.

కాగా, బ్రహ్మోత్సవాలలో మూడవరోజైన బుధ‌వారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు సింహవాహనం, రాత్రి 8 నుండి 10 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ఊరేగనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.