VEENAPANI BLESSES DEVOTEESహంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

Tirupati, 11 November 2023: Sri Padmavathi Devi as Goddess of Wisdom in Saraswati Devi Alankaram, blessed Her devotees on Hamasa Vahanam on the second day evening of the ongoing annual brahmotsavams at Tiruchanoor on Saturday evening.

TTD Chairman Sri Karunakara Reddy speaking on the occasion said the pilgrim centre has been attracting devotees in a big and complimented TTD electrical and garden wings for the amazing illuminations and decorations.

Both the senior and junior pontiffs of Tirumala, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

తిరుపతి, 2023 న‌వంబ‌రు 11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.

హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్

వాహన సేవలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. తిరుపతి, తిరుచానూరులో అత్యంత సుందరంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేసినట్లు చెప్పారు. భారతీయ సమాజం, సంస్కృతి, ఆచార వ్యవహారాలలో స్త్రీకి ప్రథమ స్థానం ఉందన్నారు. తిరుచానూరులో మాత్రమే అమ్మవారు మాడవీధుల్లో వివిధ అలంకారాలలో విహరించి భక్తులను కటాక్షిస్తారన్నారు.

నవంబర్ 14వ తేదీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు.భక్తుల సౌకర్యార్థం టీటీడీ
రూ.9.5 కోట్లతో పద్మ సరోవరంను అభివృద్ధి చేసిందన్నారు. నవంబర్ 18వ తేదీన పంచమి తీర్థం సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి విచ్చేసే
లక్షలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీ కరుణాకర రెడ్డి చెప్పారు.

వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సిఈ శ్రీ నాగేశ్వరరావు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీసుభాష్, శ్రీ గణేష్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.