VENDORS SHOULD SELL WATER BOTTLES AS PER TTD NORMS-JEO(H&E)_ టిటిడి నియమ నిబంధనల మేరకే వాటర్ బాటిళ్లు విక్రయించాలి - జేఈఓ శ్రీమతి
Tirumala,23 July 2024: TTD JEO( Health and Education ) Smt Gautami told the vendors at Tirumala to sell water bottles only at prices set by TTD.
Addressing a meeting with Vendors at health department office on Tuesday evening in Tirumala she said several pilgrims had complained that vendors were selling water bottles at higher prices and also not accepting the empty bottles on return.
Under the instructions of TTD EO Sri Syamala Rao, she directed all the vendors in Tirumala to sell water bottles for uniform price and also refund pilgrims after accepting empty bottles. At the same time she also instructed the vendors to keep their shop premises clean and hygienic to which they agreed.
Dyeo Health Smt Ashajyoti, Incharge Health Officer Dr Sunil Kumar and health department officials, Tirumala shop keepers and vendors participated.
టిటిడి నియమ నిబంధనల మేరకే వాటర్ బాటిళ్లు విక్రయించాలి
• జేఈఓ శ్రీమతి గౌతమి
తిరుమల, 2024 జూలై 23: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిళ్లు విక్రయించాలని జేఈఓ(విద్య, ఆరోగ్యం) శ్రీమతి గౌతమి చెప్పారు. తిరుమలలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుమలలోని దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నారని, కాళీ గాజు బాటిళ్లు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, తిరుమలలోని దుకాణదారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని అన్ని దుకాణాలలో ఒకే రేటుతో వాటర్ బాటిళ్లు విక్రయించాలని, కాళీ గాజు బాటిల్ తీసుకొని భక్తులకు డబ్బులు తిరిగి ఇవ్వాలన్నారు. అదేవిధంగా దుకాణదారులు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జేఈఓ ఆదేశించారు.
ఇందుకు దుకాణదారులు తమ అంగీకారం తెలిపారు.
ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, ఇంచార్జ్ హెల్త్ అధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు, దుకాణదారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.