VENGAMAMBA VARDHANTI FETE _ ఆగస్టు 24, 25వ తేదీల్లో వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలు
TIRUPATI, 22 AUGUST 2023: The 206th death anniversary of renowned saint poetess Matrusri Tarigonda Vengamamva will be observed in Tirupati and at Tarigonda in a big way by TTD on August 24 and 25.
Several literary and devotional cultural fetes are organised by TTD on the occasion besides garlanding the statue of the great devotee of Sri Venkateswara at MR Palle circle on August 25.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 24, 25వ తేదీల్లో వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలు
తిరుపతి, 2023 ఆగస్టు 22: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 24, 25వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి.
తరిగొండలో…
మాతృశ్రీ వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 24వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుండి ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తిరుపతిలో…
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 24వ తేదీన ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉదయం 10 గంటలకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగస్టు 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సంగీత సభ, ఉదయం 11.30 గంటలకు హరికథ, సాయంత్రం 6 గంటలకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.