VENGAMAMBA VARDHANTI FETE _ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

TIRUPATI, 25 AUGUST 2023: Commemorating the 206th Vardhanti Utsavam of Matrusri Tarigonda Vengamamba floral tributes were paid to her life size statue in Tirupati on Friday at MR Palle Circle.

 

Followed by a musical fete in Annamacharya Kalamandiram.

Programme Co-ordinator Smt Lata was present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

తిరుపతి, 2023 ఆగస్టు 25: భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద గల ఆమె విగ్రహానికి టీటీడీ అధికారులు శుక్రవారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అన్నమాచార్య కళామందిరంలో రెండు రోజుల పాటు జ‌రిగిన వ‌ర్ధంతి ఉత్స‌వాలు ముగిశాయి.

ఈ సంద‌ర్భంగా అన్నమాచార్య కళామందిరంలో ముందుగా శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ శ్రీనివాస కుమార్, శ్రీమతి తేజవతి బృందం సంగీత స‌భ, ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు తిరుపతికి చెందిన శ్రీమతి లక్ష్మీ రాజ్యం బృందం హ‌రిక‌థ కార్యక్రమం జరిగింది.

సాయంత్రం 6 గంటలకు శ్రీమతి ముని లక్ష్మి, శ్రీ లోకనాథం రెడ్డి బృందం సంగీత సభ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డా.లత తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.