VENNA KRISHNA RIDES SARVABHUPALA _ సర్వభూపాల వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

TIRUPATI, 25 NOVEMBER 2022: On day morning of the ongoing Karthika brahmotsavam in Tiruchanur Goddess Padmavati in the guise of Venna Krishna took a ride on Sarvabhoopala vahanam on Friday.

The devotees thronged in large numbers to witness the Seva.

Both the seers of Tirumala, JEO Sri Veerabrahmam, DyEO Sri Lokanatham, EE Sri Narasimha Murty, VGO Sri Manohar, Additional HO Dr Sunil and other officers were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సర్వభూపాల వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

తిరుపతి, 2022 నవంబరు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.

మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.

మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

సాయంత్రం 4.20 నుండి 5.20 గంటల వరకు అమ్మవారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించునున్నారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీరాములు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, విఎస్వో శ్రీ మనోహర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.