VENUGOPALA SHINES ON KALPAVRIKSHA VAHANA _ కల్పవృక్ష వాహనంపై వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ మలయప్ప
TIRUMALA, 07 OCTOBER 2024: The day started with the processional deity of Sri Malayappa Swamy taking a celestial ride on the colourfully decorated Kalpavriksha Vahanam in Tirumala on the fourth morning of the ongoing annual Brahmotsavams on Monday.
The Kalpavriksha is a divine tree that grants wishes and is said to have emerged from the milky ocean when the gods and demons churned it for the divine nectar, Amritam. Sri Malayappa donned as Sri Venugopala Swamy wearing a flute in his hand flanked by Sridevi and Bhudevi as Rukmini and Satyabhama, glittered in bright colour robes and jewels on the divine carrier.
By taking a celestial ride on this divine tree, Sri Malayappa Swamy offers both worldly and spiritual bliss to His beloved devotees.
Both the Seers of Tirumala, TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar and other officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2024 అక్టోబరు 07: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి వేణుగోపాలస్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకటయ్య చౌదరి, జెఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.