VIGRAHA STHAPANA HELD _ జమ్మూలో శాస్త్రోక్తంగా విగ్రహస్థాపన

MAHA SAMPROKSHANAM AND SRIVARI KALYANAM ON JUNE 8

JAMMU, 07 JUNE 2023: Vigraha Stapana event held on Wednesday in the Srivari temple in Majin village located on the banks of the River Suryaputri in Jammu.

The idols of Sri Venkateswara, Sri Padmavathi, Sri Goda Devi, Sri Garudalwar, Jaya-Vijaya were cleansed with sacred waters.

In Yagasala Ratnanyasam, Dhatunyasam were performed followed by Vimana Kalasa Sthapana and Vigraha Sthapana.

In the evening, Vaidika rituals including Mahashanti, Purnahuti, Chaturdasa Kalasa Snapanam, Navakalasa Snapanam and Tirumanjanam were observed in Yagasala.

On June 8, Maha Samprokshanam will be observed in the auspicious Mithuna Lagnam between 7:30pm and 8:15pm.

In the evening Srinivasa Kalyanam will be observed from 5pm onwards.

Devotees will be allowed for darshan from 9:30am onwards.

 

MP Sri Prabhakar Reddy, LAC New Delhi Chief Smt Prasanthi Reddy, JEO Sri Veerabrahmam, one of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, Kankanabhattar Sri Ramakrishna Deekshitulu, CE Sri Nageswara Rao, DyEOs Sri Gunabhushan Reddy, Sri Sivaprasad, EE Sudhakar, DyEEs Sri Raghuvarma, Sri Chengalrayalu, AEO Sri Krishna Rao, AE Sri Sitaramaraju, Superintendent Sri Subrahmanyam, Temple Inspector Sri Saikrishna were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జమ్మూలో శాస్త్రోక్తంగా విగ్రహస్థాపన
 
– జూన్ 8న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం
 
జమ్మూ, 07 జూన్ 2023: జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా విగ్రహస్థాపన నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబశుద్ధి కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలను మంత్రపూరితమైన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, రత్నన్యాసం, ధాతున్యాసం, ఆలయానికి, రాజగోపురానికి విమానకలశస్థాపన, విగ్రహస్థాపన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు మహాశాంతి, పూర్ణాహుతి, చతుర్దశ కలశస్నపనం, నవకలశస్నపనం, మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు.
 
రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు, రక్షాబంధనం, శయనాధివాసం, విశేష హోమాలు నిర్వహిస్తారు.
 
జూన్ 8న గురువారం ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు మిధున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
 
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ సతీమణి శ్రీమతి స్వర్ణలత, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాలదీక్షితులు, కంకణభట్టార్ శ్రీ రామకృష్ణ దీక్షితులు, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ శివప్రసాద్, ఇఇ శ్రీ సుధాకర్, డెప్యూటీ ఇఇలు శ్రీ రఘువర్మ, శ్రీ చెంగల్రాయలు, ఏఈవో శ్రీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.