VIJAYAWADA SRI VENKATESWARA SWAMY TEMPLE ANNUAL FESTIVAL CELEBRATED WITH DEVOTION _ భక్తి పారవశ్యంలో ఘనంగా విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షికోత్సవం
Tirupati, July 8, 2026: The annual festival of Sri Venkateswara Swamy Temple, Vijayawada, was celebrated with great devotion and religious fervour on Wednesday. Special rituals and prayers were performed, and a large number of devotees participated and received the blessings of the Lord.
As part of the celebrations, Maha Shanthi Homam and Poornahuti were conducted in the morning amid Vedic chanting. Later, Ashtottara Kalasabhishekam was performed to the processional deity of the Goddess from 11 a.m. to 12 noon.
Temple Superintendent Sri M. Mallikarjuna, Temple Inspector Smt. Lalitha Rama Devi, temple officials, priests, Vedic scholars, staff and devotees took part in the annual festivities.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
భక్తి పారవశ్యంలో ఘనంగా విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షికోత్సవం
మహాశాంతి హోమం, పూర్ణాహుతి, అష్టోత్తర కలశాభిషేకంతో ఆధ్యాత్మిక వైభవం
తిరుపతి,2026జూలై 08: విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం వార్షికోత్సవ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వేదోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారికి విశేష పూజలు, ఆరాధనలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని దివ్య అనుగ్రహాన్ని పొందారు.
ఉత్సవాల్లో భాగంగా ఉదయం మహాశాంతి హోమం ఘనంగా నిర్వహించి, వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. హోమగుండం నుంచి వెలువడిన మంత్రఘోషలు, ఆధ్యాత్మిక పరిమళాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది.
అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర కలశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర తీర్థజలాలతో జరిగిన అభిషేకం, అనంతర విశేష అలంకారంలో అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
ఈ వార్షికోత్సవ కార్యక్రమాల్లో టెంపుల్ సూపరింటెండెంట్ శ్రీ ఎం. మల్లికార్జున, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి లలిత రమాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
