VINAYAKA CHAVITI FESTIVITIES HELD _ తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి పూజ
TIRUPATI, 31 AUGUST 2022: Vinayaka Chaviti festivities were held with religious fervour in Sri Kapileswara Swamy temple on Wednesday in Tirupati.
Later in the evening, Mooshika Vahana Seva held.
Temple DyEO Sri Devendrababu, AEO Sri Srinivasulu and others were present.
IN VEDIC UNIVERSITY
On the auspicious occasion, Vinayaka Chaviti Puja was held in SV Vedic University in Tirupati.
The faculty and students of the varsity participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి పూజ
తిరుపతి, 2022 ఆగస్టు 31: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో బుధవారం వినాయక చవితి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించారు.
సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.