VIRAT STEALS – GAGAN THRILLS AT —DAY FEAT _ టీటీడీ పరిపాలనా భవనంలో ఆకట్టుకున్న అశ్వ ప్రదర్శన
Tirupati,15 August 2024: A spectacular show by the Sniffer Dogs and trained horses have stolen the show on the I-Day celebrations of TTD.
The 78th Independence Day celebrations witnessed a series of colourful events which began with the March carried out by Parade Commander Sri Satish.
The NCC cadets presented wonderful displays with trained horses-Good Luck, Roman Flame, Gagan, Fighter and Rani Jhansi.
On the other hand the Sniffer dogs team of TTD comprising Candy, Simba, Bindu, Virat, Beauty and Oscar displayed a captivating show by identifying suspicious persons and materials at the ID parade caught holding the attention of spectators.
The cultural programs by the students of SV College of Music and Dance for patriotic songs captivated the participants.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ పరిపాలనా భవనంలో ఆకట్టుకున్న అశ్వ ప్రదర్శన
తిరుపతి, 2024 ఆగష్టు 15: తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకల్లో టీటీడీ కళాశాలల ఎన్‌సిసి విద్యార్థిని విద్యార్థులు అశ్వాలతో ప్రదర్శించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
గుడ్ లక్, రోమన్ ఫ్లేమ్, గగన్, ఫైటర్, రాణి ఝాన్సీ అనే పేర్లు గల అశ్వాలతో ఎన్‌సిసి క్యాడెట్లు పలు విన్యాసాలు చేశారు. మొదటగా జాతీయ జెండా, ఎన్‌సిసి జెండా, టిటిడి జెండాలను ప్రదర్శించారు. అదేవిధంగా, టెంట్ పెగ్గింగ్, షో జంపింగ్ తదితర విన్యాసాలు చేశారు. క్యాడెట్లు అశ్వాలపై పరేడ్ మైదానంలో చుట్టూ తిరుగుతూ చేసిన ఈ విన్యాసాలు అలరించాయి.
ప్రత్యేక ఆకర్షణగా టీటీడీ జాగిలాల ప్రదర్శన
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గురువారం జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకల్లో నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యాండీ, శింబా, బిందు, విరాట్, బ్యూటీ, ఆస్కార్ అనే జాగిలాలు పాల్గొన్నాయి.
టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావుకు పుష్పగుచ్ఛం ఇచ్చి గౌరవ వందనం చేయడం, గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.