VISUAL TREAT OF CULTURAL PROGRAMS _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
TIRUPATI, 13 NOVEMBER 2023: The performance of cultural troupes in front of Vahana sevas as a part of ongoing annual brahmotsavams at Tiruchanoor have been immensely attracting pilgrim devotees.
The showcase of various art forms in front of Hanumanta Vahana Seva allured the devotees.
Among them the Padma Nrityam, Deepa Nrityam, portrayal of Puranic characters and performance of dance ballet for Annamacharya Sankeertans all through the Vahana Sevas are a few to mention.
On the other hand the devotional cultural programs at Ramachandra Pushkarini, Astana Mandapam, Mahati, Annamacharya Kalamandiram, impressed the art lovers.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
తిరుపతి, 2023 నవంబరు 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలతోపాటు పలు వేదికలపై నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా నాలుగో రోజు సోమవారం నిర్వహించిన కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి.
తిరుచానూరులోని ఆస్థానమండపంలో…
తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం మంగళధ్వని, వేద పారాయణం నిర్వహించారు. అనంతరం తిరుపతికి చెందిన డా.చక్రవర్తి రంగనాథన్ భక్తామృతం ధార్మికోపన్యాసం, బెంగళూరుకు చెందిన శ్రీమతి వాసవి సిస్టర్స్ భక్తి సంగీతం వినిపించారు. మధ్యాహ్నం తిరుపతికి చెందిన శ్రీ చంద్రశేఖర్ బృందం హరికథ, సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ మధుసూదనరావు బృందం అన్నమయ్య విన్నపాలు, ఊంజల్‌సేవలో బెంగళూరుకు చెందిన శ్రీమతి రమ్యప్రవీణ్ సంకీర్తనలను ఆలపించారు.
ఇతర వేదికలపై..
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు సురభి కళాకారులు సతీసావిత్రి నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు కృష్ణా జిల్లాకు చెందిన శ్రీ ఫణికుమార్ వేణుగానం చక్కగా వినిపించారు.
రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి నిర్మల బృందం భక్తిసంగీతం, తేజస్వీ బృందం భరతనాట్యం ప్రదర్శించారు.
తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీమతి సుజాత మురారి బృందం భరతనాట్యం, శ్రీ పవన్ కుమార్ బృందం జానపద నృత్య కార్యక్రమాలు ఆకట్టుకునేలా సాగాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.