VOLUNTEERS SANCTIFY IN SRIVARI SEVA _ ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి సేవలో ‘శ్రీవారి సేవకులు’

Vontimitta /Tirumala, 11 April 2025: The role of Srivari Sevaks rendering voluntary service in Vontimitta Sri Kodanda Ramalayam has gained popularity with their extended and enhanced qualitative services as in Tirumala.

Hundreds of sevaks came forward with a great enthusiasm to participate in the Divine Service as well offering services to their fellow pilgrim devotees with utmost dedication, discipline and devotion in various areas like serving of Annaprasadam, distribution of buttermilk and water, pilgrim crowd management, feedback survey etc.at Vontimitta during the ongoing annual Brahmotsavams.

The popularity of the state festival of Sri Sita Rama Kalyanam at Vontimitta Kodanda Ramalayam has spread across Andhra Pradesh.

With this the devotees not only from Kadapa and Annamaiah districts but also from Kurnool, Rajamundry and other districts are seen participating voluntarily as Srivari Sevaks.

TTD has invited the services of 500 sevaks every day while drafting another 2000 exclusively for Sri Sita Rama Kalyanam on April 11. 

The sevaks expressed immense pleasure to be a part in the divine festival and having received the benign blessings of Sri Kodandarama Swamy.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి సేవలో ‘శ్రీవారి సేవకులు’

ఒంటిమిట్ట/తిరుప‌తి 2025 ఏప్రిల్ 11: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందిస్తున్నారు. సాధారణ రోజులలో కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, రాయచోటి నుండి దాదాపు వెయ్యమంది, ఏప్రిల్ 11వ తేదీ శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఎండ వేడిని కూడా లెక్క‌చేయ‌కుండా 2,500 మందికి పైగా శ్రీవారి సేవకులు సేవలందించారు.

ఏప్రిల్ 11వ తేదీ శ్రీసీతారాముల కల్యాణానికి విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు అందజేసేందుకు పిఏసిలో అక్షింతలు, ముత్యం, కంకణం కలిపి ప్యాక్ చేశారు. అదేవిధంగా అన్న‌ప్ర‌సాదాల ప్యాకింగ్ మ‌రియు పంపిణీ, వాట‌ర్ బాటిళ్ళు, మ‌జ్జిగ ప్యాకెట్లు, క్యూలైన్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణలో శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు.

ప్ర‌త్యేకంగా మహిళా ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు స్వామివారిపై ఉన్న భక్తితో ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు బ్రహ్మోత్సవాలలో వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.