VONTIMITTA ANNUAL FETE COMMENCES WITH VIRTUOUS “HARIDHRA GHATNAM” _ ఒంటిమిట్టలో భక్తి వాతావరణంలో హరిధ్రా ఘటనం – శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం

Vontimitta, 25 March 2026: The annual brahmotsavams at the famous ancient shrine of Sri Kodanda Rama Swamy in Vontimitta of Kadapa district, commenced with the ceremonious ”Haridhra Ghatanam” on Wednesday

This fete marked the inaugural ritual of the annual Brahmotsavams and celestial marriage festivities of the divinities.

A large gathering of Women devotees, Srivari Sevaks, and TTD officials participated in the sacred pounding activity of turmeric roots.

Significance: The freshly prepared turmeric is used during the Snapanam (sacred bath) and to prepare Talambralu (sacred rice) for the wedding ceremony of Sri Sita Rama.

Process: The turmeric roots, along with the pounding stone and tools, are sanctified inside the Garbhalayam (sanctum sanctorum) before the ritual and ”Aradhana” was performed. This was followed by ”Mahalakshmi Aradhana”. After rendering ”Sri Suktam” Haridhra Ghatanam was performed.

After ”Samarpana” of the pounded turmeric, ”Tamboolam” was presented marking the successful completion of the event.

DyEO Smt Prasanthi, DE Electrical Smt Saraswati, PRO FAC Kum. Neelima, Superintendent Sri Hanumanthaiah, temple inspector Sri Naveen, temple priests, Vigilance and Police staff and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్టలో భక్తి వాతావరణంలో హరిధ్రా ఘటనం – శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం 

ఒంటిమిట్ట / తిరుపతి,2026మార్చి 25: కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ప్రాచీన ఆలయం శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం పవిత్రమైన హరిద్ర ఘటనం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి.

 కార్యక్రమం బ్రహ్మోత్సవాలు మరియు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టే తొలి ఆచారంగా నిర్వహించారు.

 సందర్భంగా మహిళా భక్తులుశ్రీవారి సేవకులుటీటీడీ అధికారులుసిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కొమ్ములను దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ప్రాధాన్యం :

హరిద్ర ఘటనంలో సిద్ధం చేసిన తాజా పసుపును స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజనం కార్యక్రమంలో ఉపయోగిస్తారుఅలాగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని వినియోగిస్తారు.

కార్యక్రమం విధానం :

ముందుగా పసుపు కొమ్ములు  ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారుఅనంతరం మహాలక్ష్మి ఆరాధన చేశారుశ్రీ సూక్తం పఠనానంతరం హరిద్ర ఘటనం నిర్వహించారు.

పసుపు నూరిన తరువాత సమర్పణ చేసి తాంబూలం అందజేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిడీఈ (ఎలక్ట్రికల్శ్రీమతి సరస్వతిపీఆర్‌ఓ ఎఫ్‌ఏసీ కుమారి నీలిమసూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్అర్చకులుసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.