VONTIMITTA KODANDARAMA SHINES ON SESHA VAHANA _ శేషవాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు

Vontimitta, 10 April 2022:  On day one of the ongoing annual Brahmotsavam of Sri Kodandaramaswami temple at Vontimitta in YSR Kadapa District, Sri Rama blessed devotees on the Sesha Vahana on Sunday night.

TTD JEO Sri Veerabrahmam was present in lead in the stellar vahana Seva resumed after 2 years covid gap.

TTD also organized an attractive session of Sitaram Kalyanam Kavi Sammelan on the occasion of poet Bammera Pothana Jayanti.

All Projects Program Officer Sri Vijaysaradhi presided over the event in which eminent poets and literary pundits debated on a variety of Ramayana scripts penned by various poets.

Dyeo Dr Ramana Prasad,  VGO Sri Manohar, AEO Sri Subramaniam, Superintendent Sri P Venkatesayya, Temple inspector Sri R Dhananjay were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శేషవాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు
 
ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 10: శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులను కటాక్షించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ జరుగనుంది. జెఈఓ శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.
 
ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.
 
ఆకట్టుకున్న సీతా క‌ల్యాణం కవి సమ్మేళనం
 
పోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సీతా క‌ల్యాణం పేరిట కవి సమ్మేళనం నిర్వ‌హించారు. ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారథి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీతా క‌ల్యాణం గురించి పలు ప్రముఖ గ్రంథాల్లో విశేషంగా పొందుపరిచిన అంశాలను పండితులు తెలియజేశారు. మంద‌ర‌ము,  శ్రీమ‌ద్రామాయ‌ణం క‌ల్ప‌వృక్షం, గ‌డియారం వేంక‌ట‌శేష  శాస్త్రివారి రామాయ‌ణం, శ్రీ భూత‌పురి వారి రామాయ‌ణం, మొల్ల రామాయ‌ణం, రామ‌చ‌రిత మాన‌స్, పోత‌న భాగ‌వ‌తంలోని అంశాలపై పలువురు పండితులు కవి సమ్మేళనం నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.