VSN CONSTRUCTION DONATES RS. 10 LAKHS TO TTD _ టీటీడీ ట్రస్టులకు రూ.1.10 కోట్ల విరాళం

Tirupati, June 29, 2026: Kakinada-based VSN Construction donated ₹10 lakh to the TTD Sri SV Pranadanam Trust on Monday.

The cheque was handed over to TTD Executive Officer Sri Muddada Ravichandra at the EO’s office in Tirupati.

VSN Construction Managing Partner Sri R.S. Shanta Ram and representatives Smt. Durga Kamakshi and Sri Jasti Srinivasa Rao were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

టీటీడీ ట్రస్టులకు రూ.1.10 కోట్ల విరాళం

తిరుమల, 2026 జూన్ 29: హైదరాబాద్‌కు చెందిన లేవేన్ హోల్డింగ్స్ సంస్థ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక, సేవా ట్రస్టులకు రూ.1.10 కోట్లు విరాళాన్ని అందించింది.

సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ వెంకట రవికుమార్ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి విరాళాల డీడీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీ  నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.