VYAGHRA VAHANAM HELD _ వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి
TIRUPATI, 13 FEBRUARY 2026: The ongoing annual brahmotsavam in Sri Kapileswara Swamy temple witnessed Sri Somaskanda Murty atop the ferocious Vyaghra Vahanam.
On the bright Friday the Lord was taken for a celestial ride along temple streets on Vyaghra Vahanam to bless His devotees.
TTD Officials and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి
తిరుపతి, 2026 ఫిబ్రవరి 13: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు, మదమోహ, మాత్సర్యాదులు సంహరించబడతాయి.
వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో గా భక్తులు పాల్గొన్నారు.







