WALK-IN INTERVIEWS ON AUGUST 29 FOR CIVIL ASST. SURGEON POSTS (CONTRACT) _ ఆగష్టు 29న కాంట్రాక్టు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

ఆగష్టు 29న కాంట్రాక్టు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

తిరుపతి, 2024 ఆగ‌స్టు 20: టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఒక సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (BC-B(W) -01, ST (W) – 01, BC-B -01, SC -01, BC-D(W)- 01 ) గా సేవలందించేందుకు ఎంబిబిఎస్‌ విద్యార్హత గల అభ్యర్థులకు ఆగష్టు 29వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. మొత్తం 5 పోస్టులు ఉన్నాయి.

తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని సెంట్రల్ హాస్పిటల్ లో ఉదయం 11 గంటలకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జ‌రుగ‌నుంది. ఆసక్తి గల అభ్యర్థులు త‌మ విద్యార్హతలు, అనుభ‌వానికి సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌ ఒరిజినల్ , జిరాక్స్ ‌ కాపీలతో ఇంట‌ర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను, కార్యాలయ పని వేళల్లో 0877-2264371 సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati,20 August 2024: TTD is organising walk-in interviews on August 29 for contract based five posts of Civil Assistant Surgeons (BC-B(W) -01, ST (W) – 01, BC-B -01, SC -01, BC-D(W)- 01 ) for MBBS qualified candidates to serve at TTD hospitals and dispensaries.

Interested candidates should attend the interviews from 11am onwards at the Central Hospital TTD Administrative Building Complex along with their certificates (both original and Xerox copies) of qualifications and experience.

For more details please log into the website www.tirumala.org and the hospital office during working hours   0877-2264371.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI