WATER IN TIRUMALA TO LAST FOR 130 DAYS _ తిరుమలలో భక్తులు మరియు స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించాలి
DEVOTEES AND LOCALS ARE REQUESTED TO AVOID WATER WASTAGE
TIRUMALA, 21 AUGUST 2024: The water available in the five prime dams at Tirumala has been assessed to meet the water needs of the locals and pilgrims at the Hill Town which will suffice the requirements for the next 120-130 days due to meagre rainfall received so far.
Every day nearly 43 lakh gallons of water is being consumed in Tirumala out of which 18LG are procured from Tirumala dams and remaining from Kalyani Dam located in Tirupati. The total storage capacity of Gogarbham, Akasa Ganga, Papa Vinasanam, Kumaradhara and Pasupudhara dams in Tirumala is 14,304lakh gallons out of which only available at present in Tirumala is around 5800lakh gallons only.
In the larger interests of the multitude of pilgrims visiting Tirumala during the ensuing annual brahmotsavams which is scheduled from October 4 to 12, TTD has appealed to devotees as well locals to avoid wastage of water and also contemplating some measures towards the regulation of the water consumption if the extraordinary situation persists in next few months.
TTD has appealed to devotees as well to locals to utilize the water in a thrift manner avoiding unnecessary wastage.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో భక్తులు మరియు స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించాలి
• తిరుమలలో ప్రస్తుతం నీరు 130 రోజులకు మాత్రమే ఉంది: టీటీడీ
తిరుమల, 2024 ఆగష్టు 21: ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా
తిరుమలలోని స్థానికులు మరియు యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి,
తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ పేర్కొనింది.
ఈ మేరకు బుధవారం నాడు తిరుమలలో పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గాలన్లు తిరుమల డ్యామ్‌ల నుండి మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి సేకరించబడుతుంది. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టిటిడి నిర్ణయించి భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తోంది.
ఈ మేరకు భక్తులు మరియు స్థానికులు నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.