WE ARE BLESSED KARNATAKA ARTISTS _ చిన్నశేష వాహన సేవలో కర్ణాటక కళాకారుల కోలాహలం
TIRUMALA, 16 OCTOBER 2023: The artistes from Karnataka expressed that they are blessed with the divine opportunity to perform before vahana sevas in Tirumala.
Sharing their experience to the media at Rambhagicha media centre during the press conference on Monday, the artists said they felt elated to perform before in four mada streets of Tirumala.
They thanked TTD for providing them opportunity and also for taking good care of their boarding and lodging facilities.
All Projects Program Officer Sri Rajagopal, Dasa Sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu, Annamacharya Project Director Sri Vibhishana Sharma were also present.
ART FORMS ATTRACT DURING CHINNA SESHA VAHANA
A total of 15 teams with 411 artists performed different art forms from Karnataka which included folk arts like Keelu Gurram, Yaksha Ganam, Kunita Sankeetana, Bhadrakali Nrityam, Kolatam etc.
Besides the performances by SV Balamandir students also impressed devotees.
చిన్నశేష వాహన సేవలో కర్ణాటక కళాకారుల కోలాహలం
– స్వామివారి ఎదుట ప్రదర్శనలివ్వడం పూర్వజన్మసుకృతం
– మీడియా సమావేశంలో సంతోషం వ్యక్తం చేసిన కళాకారులు
తిరుమల, 2023 అక్టోబర్ 16: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం ఉదయం చిన్నశేష వాహనసేవలో కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలిచ్చాయి.
శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో కొందరు కళాకారులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, శేషువులు, గరుత్మంతుని వేషధారణలో ఉండగా మరికొందరు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలకు నృత్యం చేశారు.
అదేవిధంగా, బెంగళూరుకు చెందిన దీప్తి బృందం జానపద నృత్యంతో ఆకట్టుకున్నారు. అనంతపురానికి చెందిన గీతాలక్ష్మీ బృందం సంప్రదాయ నృత్యరూపకంతో అలరించారు. బెంగళూరుకు చెందిన నాగరాజు బృందం సుగ్గికునిత అనే ప్రాచీన జానపద కళారూపాన్ని ప్రదర్శించి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన అనన్యా హరీశ్ బృందం నాగిని నృత్యంతో కనువిందు చేశారు. హైదరాబాదుకు చెందిన శ్రీధర్ బృందం ఆధ్వర్యంలో కోలాట నృత్య ప్రదర్శన అలరించింది. మైసూర్ కు చెందిన శ్రీవిద్య బృందం సంకీర్తనా నృత్యంతో కనువిందు చేశారు.
టీటీడీ బాలమందిర్ విద్యార్థుల కోలాట నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన ఎస్. సవిత బృందం ఆధ్వర్యంలో కీలుగుర్రం నృత్యం నయనానందకరంగా సాగింది. బెంగళూరుకు చెందిన రేణుకా ప్రసాద్ బృందం ఆధ్వర్యంలో ఆకట్టుకునే వేషధారణతో యక్షగానం అలరించింది. ఉడిపికి చెందిన వీణా బృందం ఆధ్వర్యంలో కునిత సంకీర్తన అనే జానపద కళారూపాన్ని ప్రదర్శించారు. బెంగళూరుకు చెందిన టి.కవితా బృందం ఆధ్వర్యంలో భద్రకాళి నృత్య రూపకాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన కె.ఎన్.చేతన్ బృందం కీలుగుర్రాల నృత్య విన్యాసంతో ఆకట్టుకున్నారు. ముంబయికి చెందిన నాగరాజు గోపాల్ బృందం తమ కోలాట విన్యాసాలతో భక్తులను మైమరిపించారు. తిరుమల బాలాజీ నగర్ కు చెందిన డి.శ్రీనివాసులు బృందం ఆధ్వర్యంలో కోలాట నృత్యాలతో అలరించారు. మొత్తం 15 బృందాల్లో 411 మంది కళాకారులు పాల్గొన్నారు.
పూర్వజన్మసుకృతం : కళాకారులు
వాహనసేవ అనంతరం వివిధ కళాబృందాలకు చెందిన కళాకారులు మీడియా సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. స్వామివారి ఎదుట మాడ వీధుల్లో ప్రదర్శనలివ్వడం పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. చాలా కళాబృందాలు ఉండగా తమకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. టీటీడీ అధికారులు చక్కటి బస, భోజన ఏర్పాట్లు చేశారని తెలిపారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డా. విభీషణశర్మ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.