WITNESSING SITA RAMA KALYANAM IS A DIVINE BLISS-AP CM _ శ్రీ సీతా రామ కళ్యాణం దర్శించడం మన అదృష్టం-రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
THRILLED TO SEE YOUR DEVOTION
VONTIMITTA TO BE MADE A TEMPLE TOURISM HUB
AYURVEDIC PLANTS TO BE GROWN ALL ALONG THE MOUNTAINS
LIKE GOVINDA NAMAM AT TIRUMALA, ONLY JAI SRIRAM TO RESONATE AT VONTIMITTA
ANNAPRASADAM TO COMMENCE IN VONTIMITTA ALSO
SRI RAMA IS A ROLE MODEL OF A PIOUS FAMILY RELATION
TAKE FORWARD THE LEGACY OF SRI RAMA
Vontimitta/Tirumala, 11 April 2025: In his vibrant speech, the Honourable CM of AP Sri Nara Chandrababu Naidu asserted that he aspires to reestablish Sri Rama Rajya and called on the denizens to follow the righteous and pious path of leading an ethical life as shown by Sri Rama.
After the celestial Sita Rama Kalyanam at Kalyana Vedika in Vontimitta of Kadapa district on Friday evening, the CM adressing the huge gathering of devotees who thronged the Kalyana Vedika to witness the divine wedding ceremony, said that everyone is blessed to see the celestial marriage and they are all fortunate.
He said Sri Rama has shown everyone how to keep up a promise, how to follow the instructions of father sincerely and how to love his betterhalf and maintained all the relationships with perfection.
As Tirumala echoes with Govinda Nama, I wish Vontimitta to reverberate with Jai Sriram Nama only. It’s almost a decade since Vontimitta was developed as prime pilgrim centre post bifurcation.
”On this happiest occasion, I wish that TTD Chairman Sri B R Naidu take a decision to commence Annaprasadam centre at Vontimitta also on the lines of Tirumala”, he maintained amidst a huge round of applause from the devotees.
The CM also said, Ayurvedic plantation will be developed in this pious place and also Vontimitta will soon be developed into a Pilgrimage Tourism Hub.
“Under the able leadership of the Honourable Prime Minister of India Sri Narendra Modiji, the country will prosper in every field and would become a world number one country by 2047”, he asserted.
Later the TTD Chairman Sri BR Naidu said under the instructions of the Honourable CM of AP, Annaprasadam will soon be commenced at Vontimitta.
TTD EO Sri J Syamala Rao and other TTD Board members, officials were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ సీతా రామ కళ్యాణం దర్శించడం మన అదృష్టం
తిరుమల గోవింద నామం తరహాలో ఒంటిమిట్టలో ‘జై శ్రీరామ్’ నినాదమే ప్రతిధ్వనించాలి
ఒంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తాం
కొండలపై ఆయుర్వేద మొక్కల పెంపకం
ఒంటిమిట్టలో త్వరలో అన్నప్రసాదం ప్రారంభం
శ్రీరాముడు పవిత్ర కుటుంబ సంబంధాలకు ఆదర్శం
శ్రీరాముని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి :
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
ఒంటిమిట్ట/ తిరుపతి, 2025, ఏప్రిల్ 11: శ్రీరామ రాజ్యాన్ని మళ్ళీ స్థాపించాలనే తపన తనదని, ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన నీతి, ధర్మ మార్గాన్ని అనుసరించి జీవించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ సీతా రామ కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత గౌరవ సిఎం మాట్లాడారు.
కళ్యాణ వేదిక వద్ద జరిగిన ఈ సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించడం ప్రతి ఒక్కరికీ అదృష్టంగా పేర్కొన్నారు.
శ్రీరాముడు ఒక వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, తండ్రి ఆజ్ఞను ఎలా విధిగా పాటించాలో, కుటుంబ బంధాలను ఎలా పరిపూర్ణంగా పోషించాలో తెలియజేశారని సీఎం అన్నారు.
“తిరుమలలో గోవింద నామం ప్రతిధ్వనిస్తున్న విధంగా, ఒంటిమిట్టలో ‘జై శ్రీరామ్’ నినాదమే మిన్నగా వినిపించాలి. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను ప్రధాన పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ఈ ఆలయాన్ని దశాబ్ద కాలం క్రితమే టిటిడికి ఇవ్వడమైనదన్నారు.
“ఈ సంతోషకరమైన సందర్భంగా, తిరుమల మాదిరిగా ఒంటిమిట్టలో కూడా అన్నప్రసాదం ప్రారంభించాలన్న నిశ్చయాన్ని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు తీసుకోవాలని కోరారు.
ఒంటిమిట్టను పుణ్యభూమిగా మార్చేందుకు ఇక్కడి కొండలపై ఆయుర్వేద మొక్కలను నాటనున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఒంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది 2047 నాటికి ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా మారుతుంది అని సీఎం చెప్పారు.
తర్వాత టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో అన్నప్రసాదం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి సవితా, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో జే.శ్యామల రావు, జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, టిటిడి బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది