WORKSHOP ON TRADITIONAL SCULPTING FROM SEPTEMBER 21 TO 23 _ సెప్టెంబరు 21 నుండి 23వ తేదీ వరకు ఎస్వీ శిల్ప కళాశాలలో సంప్రదాయ శిల్పకళపై వర్క్ షాప్
TIRUPATI, 13 SEPTEMBER 2022: TTD is set to organize a three-day workshop in traditional sculpting fom September 21 to 23 in Tirupati.
The workshop will commence by 9am on September 21 under the aegis of Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture (SVITSA).
About a dozen stalwarts in the field of Architecture will deliver lectures during these three days which includes temple construction in South India, Transformation of Hindu temples, stone idols and metal idols preparation techniques, Vigraha Pratistha-consecration of idols, traditional paintings, significance of sculptures in Shilpa Shastra, Saiva, Vaishnava, Sakteya Agamas and many more interesting topics.
The Principal of SVITSA Sri K Venkat Reddy is supervising the arrangements.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 21 నుండి 23వ తేదీ వరకు ఎస్వీ శిల్ప కళాశాలలో సంప్రదాయ శిల్పకళపై వర్క్ షాప్
తిరుపతి, 2022 సెప్టెంబరు 13: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థలో సెప్టెంబరు 21 నుంచి 23వ తేదీ వరకు సంప్రదాయ శిల్పకళ – అనుబంధ అంశాలపై వర్క్ షాప్ జరుగనుంది. సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఇందులో భాగంగా మూడు రోజుల పాటు 12 మంది నిష్ణాతులు పలు అంశాలపై ఉపన్యసిస్తారు. వీటిలో శిల్పశాస్త్రాల ప్రకారం దక్షిణ భారతదేశంలో ఆలయాల నిర్మాణం…., హిందూ ఆలయాల పరిణామక్రమం…, లోహ శిల్పాల తయారీ విధానం, విగ్రహప్రతిష్ట విధానం…., సంప్రదాయ చిత్రకళలో మెళకువలు…., శిల్ప శాస్త్రాల్లో ప్రతిమా లక్షణాలు…, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆలయ నిర్మాణ మెళకువలు…., శైవ, వైష్ణవ, శాక్తేయ ఆగమాలపై ఉపన్యాసం…., భారతీయ రేఖాచిత్రాల చరిత్ర…., దక్షిణ భారతదేశ ఆలయాల్లో ప్రసాదాల ప్రాముఖ్యత…, సుధా శిల్పాల తయారీ విధానం….., ఆలయాల నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి.
శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె.వెంకటరెడ్డి ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.