YAGAS PROVIDES GOOD VIRTUES _ యజ్ఞయాగాలను దర్శిస్తే సకల శుభాలు : ఆచార్య కుప్పా విశ్వనాథ శర్మ
YAGAS PROVIDES GOOD VIRTUES
TIRUPATI, 02 JULY 2023: Yagas provides good virtues to the humanity said renowned Vedic scholar Sri Kuppa Vishwanatha Sharma.
Speaking on the occasion of ongoing Chaturveda Havanam in the Parade Grounds of TTD on Sunday evening he spoke on ”Today’s Society – Importance of Yaga Culture”.
Later the Srinivasa Kalyanam dance ballet presented by students of SV College of Music and Dance choreographed by Principal Dr Uma Muddubala allured the devotees.
TTD Board Member Sri Ashok Kumar, DEO Sri Bhaskar Reddy, SVIHVS Special Officer Dr Vibhishana Sharma and others were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
యజ్ఞయాగాలను దర్శిస్తే సకల శుభాలు : ఆచార్య కుప్పా విశ్వనాథ శర్మ
– భక్తిభావాన్ని పంచిన శ్రీనివాస కల్యాణం నృత్య రూపకం
తిరుపతి, 2023, జూలై 02: చతుర్వేద హవనంలో భాగంగా నిర్వహిస్తున్న యజ్ఞయాగాలను దర్శించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ ఉద్ఘాటించారు. టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానంలో జరుగుతున్న
శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం ఆదివారం నాలుగో రోజుకు చేరుకుంది.
రాత్రి 7 గంటలకు ఆచార్య కుప్పా విశ్వనాథ శర్మ “నేటి సమాజం – యజ్ఞ సంస్కృతి ఆవశ్యకత” అనే అంశంపై ఉపన్యసించారు. యజ్ఞాలు మానవులను పరిశుద్ధం చేసి పరమాత్మ చెంతకు చేరుస్తాయని చెప్పారు. అగ్ని శుచిత్వానికి ప్రతీక అని, అగ్నితో చేసే యజ్ఞానికి ఫలితం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వేదమంత్రపూర్వకంగా అగ్నిలో ఆహుతులను సమర్పిస్తే అవి దేవతలకు చేరి మనకు సిరిసంపదలు చేకూరుతాయని చెప్పారు. అంతరించిపోతున్న యజ్ఞ సంస్కృతిని పునరుజ్జీవింప చేసేందుకు టీటీడీ చతుర్వేద హవనాలు చేపట్టడం ముదావహమన్నారు.
కాగా, వేదపండితులు ఉదయం చతుర్వేద హవనం, మధ్యాహ్నం చతుర్వేద పారాయణం నిర్వహించారు.
ఆకట్టుకున్న శ్రీనివాస కల్యాణం నృత్య రూపకం
సాయంత్రం జరిగిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ ఎస్.శ్రీవాణి బృందం వీణావాద్య కచేరి నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు డా.కె.వందన బృందం సంగీత కచేరీ జరిగింది. ఇందులో పలు అన్నమయ్య కీర్తనలను చక్కగా ఆలపించారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమాముద్దుబాల బృందం “శ్రీనివాస కల్యాణం” నృత్య రూపకాన్ని చక్కటి హావభావాలతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తిభావాన్ని పంచింది.
ఈ కార్యక్రమాల్లో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జేఈవో శ్రీ వీరబ్రహ్మం , డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.