YOGA FOR MENTAL AND PHYSICAL STABILITY – TTD ADDITIONAL EO _ మానసికంగా, శారీరకంగా నియంత్రణలో ఉండడం యోగాతోనేసాధ్యం : టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి
Tirupati, 21 June 2025: Practicing Yoga every day not only improves the mental fitness but also in inner engineering of ones body, asserted the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary.
Following the clarion call given by the Honourable PM of India Sri Narendra Modi and under directives of the Honourable CM of AP Sri Chandrababu Naidu, the International Yoga Day was organized by TTD at its Parade Grounds behind the TTD administration building in Tirupati on Saturday.
Speaking on the occasion, Additional EO said that today Yoga Day is being observed across 190 countries worldwide.
He said that with yoga, spiritual, mental, emotional, physical and other factors can be kept under control.
TTD employees and students participated in this fete.
Meanwhile the Yoga fete began with 1500 participants in the Parade Grounds after formally offering prayers to Sri Venkateswara Swamy.
Later the Annamacharya Project Special Officer Dr Medasani Mohan elucidated the importance of Yoga in Hindu Sanatana Dharma.
An hour long Yoga Asanas and Pranayama were carried out in a systematic manner as instructed by the Yoga instructors from TTD and also from the ISHA Foundation.
Later the officials have given away participant certificates to the students on the occasion.
TTD has arranged 4 LED screens, yoga mats, drinking water bottles, breakfast and t-shirts on the occasion.
TTD board members Smt. Panabaka Lakshmi, Sri G. Bhanu Prakash Reddy, JEO Sri Veerabraham, CVSO Sri Murali Krishna, HDPP Secretary Sri Sriram Raghunath, DEO Sri Venkata Sunilu, and many other officers, students, Srivari Sevaks were also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
- default
- default
- default
మానసికంగా, శారీరకంగా నియంత్రణలో ఉండడం యోగాతోనే సాధ్యం : టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి
తిరుపతి, 2025, జూన్ 21: మానవ సమాజంలో ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా నియంత్రణలో ఉండడం యోగాతోనే సాధ్యమని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. టిటిడి పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ మైదానంలో శనివారం యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, విశ్వవ్యాప్తంగా 190 దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మాట్లాడారు. నవీన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. యోగాతో ఆధ్యాత్మికత, మానసిక ఒత్తిళ్లు, శారీరకంగా తదితర అంశాలను నియంత్రణలో ఉండవచ్చని, తద్వారా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. అంతర్గతంగా మనం సమాజంలో ఎలా ఉండాలో, జ్ఞాన వంతంగా, ఉన్నతంగా సమాజంలో ఉండేందుకు యోగా అంతర్గత పాఠాలు నేర్పుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగాను చేయడం దిన చర్యగా పాటించాలని ఆయన సూచించారు. యోగా దినోత్సవంలో టిటిడి ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమన్నారు.
విశాఖలో జరుగుతున్న యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాధాన్యతమరింత పెంచేలా ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ, సిఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
ముందుగా పరేడ్ మైదానంలో స్వామి వారికి దీపారాధన, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం యోగా నిపుణులు చేసిన ఆసనాలను క్రమ పద్ధతిలో టిటిడి అధికారులు, సిబ్బంది, విద్యార్థులు చేశారు. యోగాసనాలు చేసేందుకు వీలుగా 4 ఎల్ ఈ డీ స్క్రీన్ లను , యోగా మ్యాట్ లను, త్రాగునీరు, కార్పేట్లు, అల్పాహారం, టీ షర్ట్ లను టిటిడి ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళీ కృష్ణ, పలువురు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.