YOGA NARASIMHA RIDES SIMHA VAHANA _ సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
Tirupati, 21 Jun. 21: Yoga Narasimha blessed His devotees on Simha Vahana on the third day morning vahana seva on Monday at Appalayagunta.
The ongoing Brahmotsavams witnessed Sri Prasanna Venkateswara Swamy on the ferocious Simha Vahanam.
Superintendent Sri Gopalakrishna Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2021 జూన్ 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం స్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహించారు.
సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు చెబుతున్నారు.
కాగా సోమవారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, ప్రధాన అర్చకులు మరియు కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.