YOGALAKSHMI GRACES ON SIMHA _ సింహ వాహనంపై యోగలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి

TIRUPATI, 12 NOVEMBER 2023: On the third day evening Sri Padmavathi Devi as Yoga Lakshmi blessed Her devotees along four mada streets on Simha Vahanam.

The pleasant evening on Sunday witnessed the majestic Sarva Swatantra Veeralakshmi as Yoga Lakshmi in the pose of Yoga atop Simha Vahanam.

Both the seers of Tirumala, JEO Sri Veerabrahmam, SE2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Govindarajan and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సింహ వాహనంపై యోగలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి

తిరుప‌తి, 2023 నవంబర్ 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి సింహ వాహనంపై యోగలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ప్రారంభ‌మైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు.

వాహనసేవల్లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఏఈవో శ్రీ ర‌మేష్, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్లు శ్రీమతి శ్రీవాణి, శ్రీ శేషగిరి, టెంపుల్‌ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్‌, శ్రీ గ‌ణేష్‌ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.