NAVARATRI UTSAVAMS AT TIRUCHANOOR _ అక్టోబ‌రు 17 నుంచి 26వ తేదీ వరకు తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

Tirupati, 09 Oct. 20The Navaratri utsavams will be conducted at Sri Padmavati Ammavari temple in Tiruchanoor from October 17-26 in ekantham due to Covid restrictions.

As part of the festival daily Snapana Tirumanjanam will be performed to the utsava idol of Ammavaru at the Sri Krishna Mandapam.

Later in the evening unjal seva is performed to the utsava deity inside temple. On October 26, Gaja vahana seva is observed in ekantham only.

Following Navaratri festival events, TTD has cancelled Kalyanotsavam and Sahasra Deepalankara seva on all 10 days and Lakshmi Puja on October 23.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 17 నుంచి 26వ తేదీ వరకు తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2020 అక్టోబ‌రు 09: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబ‌రు 17 నుంచి 26వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 26వ తేదీనాడు ఆల‌యంలో గజ వాహనసేవ చేప‌డ‌తారు. ఈ ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌, అక్టోబరు 23న ల‌క్ష్మీపూజ సేవ‌లు రద్ద‌య్యాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.