VEDIC SCIENCE EMBEDDED IN ANNAMAIAH SANKEERTANS- DR D YUVASRI _ అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానసారం : డా|| డి.యువ‌శ్రీ‌

Tirupati, 20 May 2022: The basic tenets of Vedic Sciences are embedded in the sankeertans of Sri Tallapaka Annamacharya, says prominent Telugu writer and orator Dr D Yuvashakti.

 Participating in the literary convention organised by TTD as part of the 614th Jayanti of saint-poet Annamacharya on Friday at Annamacharya Kala Mandiram on the theme of ‘Sri Rama in Annamaiah sankeertan’ he said the summary of all Vedic mantras was ingrained in Sri Venkateswara mantras and Annamaiah sankeertans had promoted all deities in his works.

 The cultural programs, Harikatha and vocal concerts were held by artists of Annamacharya projects both at Annamacharya Kala Mandiram and Mahati auditorium as part of the celebrations, which allured the audience.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానసారం : డా|| డి.యువ‌శ్రీ‌

తిరుపతి, 2022 మే 20: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల్లో వేద విజ్ఞానసారం ఇమిడి ఉందని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ విశ్వ‌విద్యాల‌యం తెలుగు ఆచార్యులు డా|| డి.యువ‌శ్రీ‌ పేర్కొన్నారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జ‌యంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్ర‌వారం సాహితీ సదస్సు జ‌రిగింది.

ఇందులో భాగంగా డాక్టర్‌డి.యువ‌శ్రీ‌ ‘అన్నమయ్య సంకీర్తనలలో శ్రీ‌రాముడు ‘ అనే అంశంపై ఉపన్యసిస్తూ శరణాగతి, లోకనీతి, వేదాల్లోని సారాన్ని కలిపి అన్నమయ్య తన సాహిత్యాన్ని సృష్టించారని చెప్పారు. యావత్‌ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. అన్ని మంత్రాల సారం శ్రీ వేంకటేశ్వర మంత్రంలో ఉందంటూ స్వామివారిపై ఎనలేని భక్తిని చాటారన్నారు. అన్నమయ్య జీవిత విశేషాలను పరిశీలిస్తే తెలుగునాట భాగవత శిఖామణులుగా, భాగవతోత్తములుగా గుర్తింపు పొందారని చెప్పారు. ఆయ‌న కీర్తనలలో సామాన్య ప్రజలను చైతన్యవంతం చేసేలా, భక్తిభావాన్ని పెంచేలా ఉన్నాయన్నారు. అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు తదితర దేవతలకు ప్రాధాన్యం కల్పించారని వివరించారు.

అంత‌కుముందు ఉద‌యం 10.30 గంటలకు మ‌ద‌న‌ప‌ల్లికి చెందిన శ్రీమ‌తి నాగ‌మ‌ణి బృందం హ‌రిక‌థ పారాయ‌ణం నిర్వ‌హించారు. రాత్రి 7 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ రాజ‌మోహ‌న్‌, శ్రీ వి.వి.వి.ప్ర‌సాద్‌ బృందం గాత్ర సంగీత స‌భ‌ నిర్వ‌హించారు.

మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో…

తిరుపతి మహతి కళాక్షేత్రంలో శుక్ర‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీమ‌తి సుశీల‌ బృందం అన్న‌మ‌య్య సంకీర్త‌న లహ‌రి గాత్రం, రాత్రి 7.30 గంట‌లకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి శ్రీ‌ర‌మానాగ లావ‌ణ్య‌ బృందం భ‌ర‌త నాట్యం నృత్య కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.