JEO (Education and Health) INSPECTS ANNAPRASADAM CENTRES IN TIRUPATI _ అన్న‌ప్ర‌సాద కేంద్రాల‌ను ప‌రిశీలించిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 29 Oct. 20:  The TTD JEO (Education & Health) Smt Sada Bhargavi on Thursday inspected the Anna Prasadam centres in Tirupati.

As part of her inspection tour the JEO inspected Anna Prasadam centre at the BIRRD hospital where patients were given free food besides the Anna Prasadam Bhavan at Tiruchanoor, and employees canteen at the TTD administrative buildings building.

During her tour the JEO checked on health safety steps at hospital and Covid-19 guidelines implemented at the Anna Prasadam centres.

Later on She inspected the quality of food items, leafiness at the dining halls, kitchen, store room, drinking water system, collecting wet and dry garbage, sanitation and clean toilets and issued specific directions to officials and staff.

She directed that quality and delicious food be provided to all devotees, patients and their caretakers.

TTD DyEO (canteens) Sri Lakshmi Naik and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్న‌ప్ర‌సాద కేంద్రాల‌ను ప‌రిశీలించిన  జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

తిరుపతి, 2020 అక్టోబర్ 29: తిరుపతిలోని టిటిడి ఉచిత అన్న‌ప్ర‌సాద కేంద్రాల‌ను జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి గురువారం ప‌రిశీలించారు.

బ‌ర్డ్‌ ఆసుప‌త్రిలో రోగుల‌కు, వారి స‌హాయ‌కుల‌కు టిటిడి ఉచితంగా అందిస్తున్న అన్న‌ప్రసాదాల‌ పంపిణీని ప‌రిశీలించారు. అనంత‌రం తిరుచానూరులోని అన్నప్రసాద భవనాన్ని,  టిటిడి పరిపాలనా భవనం స‌మూదాయంలోని ఉద్యోగుల క్యాంటీన్ త‌నిఖీ చేశారు.

కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు భ‌క్తులు, ఉద్యోగులు, రోగులు, వారి స‌హాయ‌కుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని  తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. ఆయా క్యాంటీన్లలో, ఆసుప‌త్రుల‌లో పంపిణీ చేస్తున్న ఆహార ప‌దార్థాల నాణ్య‌త‌, డైనింగ్ హాల్, వంటశాల, స్టోర్ రూమ్, తాగునీటి వసతి, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ త‌దిత‌రాల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. భ‌క్తుల‌కు, ఉద్యోగుల‌కు, రోగులు, వారి స‌హాయ‌కుల‌కు మ‌రింత‌ రుచిక‌ర‌మైన‌, శుచిక‌ర‌మైన ఆహారాన్ని అందించాల‌ని జెఈవో అధికారుల‌ను ఆదేశించారు.  

జెఈఓ వెంట డెప్యూటీ ఈవో(క్యాంటీన్‌) శ్రీ లక్ష్మ‌ణ్ నాయ‌క్‌, ఇత‌ర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.