TTD FILES COMPLAINT AGAINST PERSON FOR USING AMAZON ONLINE PLATFORM FOR SELLING TTD CALENDARS/DIARIES ON HIGH PRICES _ అమెజాన్‌లో టిటిడి క్యాలెండ‌ర్లు, డైరీలు అధిక ధరలకు విక్ర‌యించిన వ్య‌క్తిపై ఫిర్యాదు

Tirupati, 31 December 2021: TTD had placed its products like 2022 calendars and dairies in online Amazon India services and India Posts platforms to provide extended accessibility to devotees in the COVID-19 situation.

The availability of TTD products in Kalyana Mandapams and TTD information centres across the country were also widely advertised for benefit of devotees.

It is notice by TTD that some private vendors are exploiting Amazon platform and selling TTD products at higher prices than prescribed tariff by TTD.

TTD officials have taken up the issue with the Amazon and asked them to take stringent action on private vendors for exploiting the devotees.

TTD has appealed to devotees to take note of the same and act cautiously and deal with Amazon portal directly rather than other vendors.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమెజాన్‌లో టిటిడి క్యాలెండ‌ర్లు, డైరీలు అధిక ధరలకు విక్ర‌యించిన వ్య‌క్తిపై ఫిర్యాదు

తిరుప‌తి, 2021, డిసెంబ‌రు 31: అమెజాన్ ఆన్‌లైన్ ఇండియా స‌ర్వీసెస్ ద్వారా టిటిడి క్యాలెండ‌ర్లు, డైరీలు అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్నార‌ని శుక్ర‌వారం కొన్ని దిన‌ప‌త్రిక‌ల్లో వార్తలు ప్ర‌చురిత‌మ‌య్యాయి. 2022 డైరీలు, క్యాలెండ‌ర్లు తిరుమ‌ల, తిరుప‌తితోపాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న స‌మాచార కేంద్రాలు, క‌ల్యాణ‌మండ‌పాల్లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది.

కోవిడ్ వ‌ల్ల భ‌క్తుల సౌల‌భ్యం కోసం ఆన్‌లైన్ ద్వారా కూడా డైరీలు, క్యాలెండ‌ర్లు పొందే సౌల‌భ్యం టిటిడి క‌ల్పించింది. ఇందులో భాగంగా అమెజాన్ ఆన్‌లైన్ ఇండియా స‌ర్వీసెస్‌తోపాటు పోస్ట‌ల్ శాఖ ద్వారా కూడా వీటిని కొనుగోలుచేసే స‌దుపాయం క‌ల్పించ‌డం జ‌రిగింది. కొంద‌రు ప్ర‌యివేటు వ్య‌క్తులు అమెజాన్ ప్లాట్‌ఫామ్ ఉప‌యోగించుకుని టిటిడి డైరీలు, క్యాలెండ‌ర్లు అధిక ధ‌ర‌లకు విక్ర‌యిస్తున్న‌ట్టు టిటిడి దృష్టికి వ‌చ్చింది. వెంట‌నే టిటిడి అధికారులు అమెజాన్ సంస్థ‌కు ఫిర్యాదు చేసి స‌ద‌రు ప్ర‌యివేటు వ్య‌క్తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర‌డం జ‌రిగింది. టిటిడి ఫిర్యాదు మేర‌కు అమెజాన్ సంస్థ ప్ర‌యివేటు వ్య‌క్తి అమ్మ‌కాల‌ను ఆపివేయ‌డం జ‌రిగింది. భ‌క్తులు ఈ విష‌యం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.