PAVITROTSAVAMS AT TONDAMANADU _ ఆగ‌స్టు 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు తొండమనాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

TIRUPATI, 08 AUGUST 2022: The annual Pavitrotsavams at Tondamanadu temple will ve observed between August 10-12 with Ankurarpana on August 9.

On August 10, Pavitra Pratistha, August 11, Pavitra Samarpana and August 12 Pavitra Purnahuti will be observed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు తొండమనాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి, 2022 ఆగస్టు 08: టిటిడికి చెందిన తొండమనాడులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 10 నుండి 12వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 9న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.

ఇందులో భాగంగా ఆగస్టు 10న ఉద‌యం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు,  ఆగ‌స్టు 11న ఉద‌యం పవిత్ర సమర్పణ, సాయంత్రం చ‌తుష్టానార్చ‌న నిర్వ‌హిస్తారు. ఆగస్టు 12న ఉద‌యం మహా పూర్ణాహుతి, ప‌విత్ర విత‌ర‌ణ‌, స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంత‌రం సాయంత్రం ప్రాకార ఉత్స‌వం, ఆస్థానం చేప‌డ‌తారు.

ఈ సంద‌ర్భంగా టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.