FIRST OF ITS KIND, ONLINE SRIVARI KALYANOTSAVAM FROM AUGUST 7 _ ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ లో శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం‌ సేవ : 6 నుంచి ఆన్ లైన్ లో టికెట్లు

Tirumala, 5 Aug. 20: In a first of its kind, on popular demand of devotees, the TTD has decided to organise the Nitya Srivari Kalyanotsavam on a virtual platform online from August 7th, Friday in view of COVID-19 restrictions.

Following the success of conducting the Sri Varalakshmi Vratam online and on a virtual platform the TTD is introducing the Arjita Seva, which was suspended since March due to COVID-19 restrictions.

TTD is releasing the online tickets for the period August7-31 for Srivari Kalyanotsavam from 11.00 am of August 6, tomorrow and devotees could buy them by clicking on the TTD website www.tirupatibalaji.ap.gov.in.

The devotees have to submit their details (as per TTD terms and conditions) and pay Rs.1000/- through the eligible payment gateway and obtain a receipt. They will be sent Srivari Prasadam (uttarium, blouse, and akahintas) through the India post free of cost.

The arjita Seva of Srivari Nitya Kalyanotsavam will be performed in ekantham and live telecast every day at 12.00 noon for benefit of the devotees. The participating devotees should dress traditionally and on archakas instructions make sankalpam with their names and Gotras. However, the TTD archakas will perform sankalpam of all devotees who had procured online tickets.

How to book online for Nitya Srivari kalyanotsavam.

  • Login to the www.tirupatibalaji.ap.gov.in website
  • Click on the Kalyanotsavam (online participation).
  • Next Click on the box I agree, to accept the terms and conditions of TTD.
  • Enter the date of Kalyanotsavam you want to participate, names of two devotees (per ticket), age, gender, region, email I’d, mobile number, and address for which the Prasadam has to be sent.
  • After checking all information provided click on the continue button to get the payment page.
  • Pay the relevant fee with either debit/ credit cards or on net banking mode.
  • After the payment process is complete, the online tickets are finalised,

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ లో శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం‌ సేవ : 6నుంచి ఆన్ లైన్ లో టికెట్లు
       
తిరుమ‌ల‌, 2020 ఆగ‌స్టు 05:  తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ప్ర‌తి రోజు నిర్వ‌హించే శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వాన్ని భ‌క్తుల కోరిక మేర‌కు ఆగ‌స్టు 7వ తేదీ శుక్ర‌వారం నుండి ఆన్ లైన్ విధానంలో నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. 

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా శ్రీ వారి కళ్యాణోత్సవాన్ని భ‌క్తులు  త‌మ ఇళ్ళ నుండి ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో వీక్షించడం ద్వారా క‌ల్యాణోత్స‌వ‌ సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్నామన్న భావన కలుగుతుంది. ఆగ‌స్టు 7 నుండి 31వ తేదీ వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం టికెట్లు ఆగ‌స్టు 6వ తేదీ ఉద‌యం 11.00 గంట‌ల నుండి ఆన్ లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావ‌ల‌సిన గృహ‌స్తులు టిటిడి వెబ్‌సైట్‌లో (www.tirupatibalaji.ap.gov.in) త‌మ వివ‌రాలు పొందుప‌రచి, టిటిడి నియ‌మ నిబంధ‌న‌లకు లోబ‌డి గేట్‌వే ద్వా‌రా రూ.1000/- చెల్లించి ఆన్‌లైన్ ర‌శీదు పొంద‌వ‌చ్చు. శ్రీ‌వారి ప్ర‌సాదాలను పోస్ట‌ల్ శాఖ ద్వారా టిటిడి ఉచితంగా అందిస్తుంది.  

స్వామివారి క‌ల్యాణోత్స‌వం ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం 12. గంట‌ల‌కు ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారమవుతుంది. పాల్గొనే గృహ‌స్తులు సాంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి, అర్చ‌క స్వాముల సూచ‌న‌ల మేర‌కు త‌మ గోత్ర ‌నామాల‌తో సంక‌ల్పం చెప్పాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్లు పొందిన  గృహ‌స్తుల పేరు,  గోత్ర నామాల ప్రతిని అర్చకులు స్వామివారి మూల విరాట్టు పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహిస్తారు.

ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు ఉత్త‌రియం, ర‌విక‌, అక్షింత‌లు ప్ర‌సాదంగా పోస్ట‌ల్ శాఖ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంది. 

టికెట్లు బుక్ చేసుకునే విధానం ముందుగా www.tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి.

– ఆన్‌లైన్‌లో క‌ల్యాణోత్స‌వం (ఆన్‌లైన్ పార్టిసిపేషన్) అనే బటన్ ని క్లిక్ చేయాలి.

– ఇక్కడ టిటిడి పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తూ I Agree అనే బాక్స్‌ లో టిక్ గుర్తు పెట్టాలి.

– ఆ తర్వాత క‌ల్యాణోత్స‌వం తేదీని,  గృహస్తుల(ఇద్దరు) పేర్లు, వయసు, లింగం, గోత్రం, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ప్రసాదాలు పంపాల్సిన చిరునామా వివరాలు పొందుపరచాలి. 

– ఈ సమాచారాన్ని సరిచూసుకుని కంటిన్యూ అనే బటన్ నొక్కితే పేమెంట్ పేజి వస్తుంది.

– ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాకింగ్‌ ద్వారా టికెట్ మొత్తాన్ని చెల్లించవచ్చు.

– పేమెంట్ పూర్తయిన అనంతరం టికెట్ ఖరారవుతుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.