ALL SET FOR VARALAKSHMI VRATAM AT TIRUCHANOOR ON AUGUST 20 _ ఆగ‌స్టు 20న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

TIRUPATI, 20 AUGUST 2021: The colourful religious fete, Varalakshmi Vratam will be performed in Tiruchanoor on Friday and all arrangements for the same have been completed by the respective departments in a big way.

However, due to Covid restrictions, this festival will be observed in Ekantam in Sri Krishna Mukha Mandapam at Tiruchanoor temple and the entire event will be live telecasted on SVBC between 10am and 12 noon for the sake of global devotees as well as the virtual ticket holders who booked the Seva in online.

TTD will present one blouse piece, uttariyam, turmeric, vermilion, akshatas, and kankanams along with a dozen bangles as Prasadam to the devotees who participated virtually. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 20న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనే అవ‌కాశం

తిరుపతి, 2021 ఆగ‌స్టు 19: సిరుల‌త‌ల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 20న శుక్ర‌వారం వరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మం ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఆగ‌స్టు 20న ఉద‌యం అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఉద‌యం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌కృష్ణస్వామి ముఖ మండ‌పంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం నిర్వ‌హిస్తారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా టికెట్ల‌ను టిటిడి ఆన్‌లైన్‌లో విక్రయించింది.

ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, కుంకుమ‌, అక్షింత‌లు, కంక‌ణాలు, డ‌జ‌ను గాజులు ప్ర‌సాదంగా ఇండియా పోస్ట‌ల్ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.