KUMBHABHISHEKAM TO TTD TEMPLES _ ఆలయాల కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేయండి – టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

TIRUPATI, 07 NOVEMBER 2022: The Kumbhabhishekam for TTD-run temples including Jammu, Chennai, Rampachodavaram, Sitampeta will be observed between March and May next, said TTD JEO Sri Veerabrahmam.

 

Speaking to Engineering, local temples Deputy EOs and other officials in the conference hall of the TTD Administrative Building on Monday the JEO said the arrangements for Kumbhabhishekam works should commence from now itself for the temples which are under the completion stage.

 

He also directed the officials concerned to submit him a comprehensive report on the conditions, requirements and issues related to the temples which falls under their jurisdiction regularly.

 

He also reviewed on Sevas, Dittam, sanitation, cleanliness etc. related to various temples. The JEO also directed CE to speed up the development works at Vontimitta.

 

CE Sri Nageswara Rao, SE Sri Satyanarayana, GM Transport Sri Shesha Reddy, DFO Sri Srinivas and others were also present.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆలయాల కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేయండి – టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 7 నవంబరు 2022: జమ్ము, చెన్నై, రంపచోడవరం, సీతంపేట ల్లో టీటీడీ నిర్మించిన ఆలయాల కుంభాభిషేకాలు వచ్చే ఏడాది మార్చి నుంచి మే లోగా ఉంటాయని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. సంబంధిత అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

టీటీడీ పరిపాలన భవనం లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన ఇంజినీరింగ్, ఆలయాల డిప్యూటీ ఈవో లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, నిర్మాణం పూర్తి అయిన ఆలయాల కుంభాభిషేకానికి ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలన్నీ పంపాలని సూచించారు. కుంభాభిషేకంకు ఏవైనా ఇబ్బందులు ఉంటే స్థానిక అధికారులను సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన చెప్పారు. జమ్ము ఆలయానికి సంబంధించి వాటర్ పైప్ లైన్ నిర్మాణం, గార్డెనింగ్ పనుల్లో వేగం పెంచాలని జేఈవో సూచించారు. సెక్యూరిటీ, శ్రీవారి సేవకుల ఏర్పాటుకు సబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ఆవరణంలో బ్యాంకు శాఖ ఏర్పాటు విషయం పరిశీలించాలన్నారు.

డిప్యూటీ ఈవోలు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఆలయాలను ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. డిప్యూటీ ఈవోలు తమ పరిధిలో ఉన్న టీటీడీ విలీన ఆలయాలను తరచూ సందర్శించి అక్కడి పరిస్థితులు, సమస్యలపై తనకు నివేదికలు ఇవ్వాలన్నారు. చెన్నై సమాచార కేంద్రంలోని ఆలయంలో సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సంఖ్యను బట్టి ఆలయాల్లో దిట్టం అంశం సమీక్షించాలని ఆయన సూచించారు. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం అభివృద్ధి పనుల పురోగతిపై చర్యలు తీసుకోవాలని ఆయన సిఈ ని ఆదేశించారు.

చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ శ్రీ సత్యనారాయణ, రవాణా విభాగం జి ఎం శ్రీ శేషారెడ్డి, డిఎఫ్వో శ్రీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది