BHOOMI POOJA PERFORMED TO SRIVARI TEMPLE AT ULUNDURPETA _ ఉలందూరు పేట లో శ్రీవారి ఆలయ నిర్మాణం వైభవంగా భూమి పూజ

TN CM AND TTD CHARIMAN TAKE PART

 DEVOTEES ALSO PARTICIPATE

Tirumala, 22 Feb. 21: The ceremonious Bhoomi Pooja was performed to the Srivari Temple that is coming up in Ulundurpeta of Tamilnadu which was attended by the Honourable CM of Tamil Nadu Sri Palani Swamy and TTD Chairman Sri YV Subba Reddy.

After Sankalpam, Punyahavachanam, Ganapathi Pooja, Vishwaksena Pooja, the Bhoomi Pooja was performed amidst chanting of vedic hymns by pundits who placed four bricks and performed special pooja. Local MLA, TTD Trust Board member and donor of the land to construct the Srivari temple in Ulundurpeta, Sri Kumaraguru made elaborate arrangements for the ceremony.

Along with another TTD Board member Sri Sekhar Reddy, some MLAs also participated in the event. CE Sri Ramesh Reddy was also present. Devotees also participated in this Pooja.

Meanwhile, Sri Kumaraguru has donated 3.98acres of land, 3.16crore as a donation towards the construction of the Srivari temple along with sub-shrines for Sri Padmavathi Ammavaru and Sri Andal Godai. Apart from these temples, office, potu, storeroom, walls, the parking area will also be constructed for the temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఉలందూరు పేట లో శ్రీవారి ఆలయ నిర్మాణం వైభవంగా భూమి పూజ

– తమిళనాడు సిఎం శ్రీ పళని స్వామి, టీటీడీ చైర్మన్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరు

– వేలాదిగా హాజరైన భక్తులు

తిరుమల 22 ఫిబ్రవరి 2021: తమిళనాడు రాష్ట్రం ఉలుందురు పేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.
అర్చకులు సంకల్పం, పుణ్యాహవాచనం, గణపతి పూజ,విష్వక్సేన పూజ నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నవధాన్యాలను భూమిలో ఉంచి ఆలయనిర్మాణానికి నాలుగు ఇటుకలు ఉంచి నాలుగు వేదాలను ఆవాహనం చేశారు.

24 బెత్తలు ( 18 అంగుళాలు) భూమిలో ఈ ఇటుకలు ఉంచి ప్రత్యేకంగా శిలాన్యాస పూజలు చేశారు. భూమి పూజ సందర్బంగా స్థానిక శాసన సభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కుమరగురు భారీ ఏర్పాట్లు చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ యెడపాటి పళని స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, శాసన సభ్యులు శ్రీ కుమరగురు దంపతులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి, పలువురు శాసన సభ్యులు, టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి తో పాటు వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణం ఇలా…

– ఉలందురు పేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ సభ్యులు శ్రీ కుమారగురు ఆలయ నిర్మాణం కోసం 3 ఎకరాల 98 సెంట్ల భూమి దానంగా ఇచ్చారు.

– దీంతో పాటు ఆలయ నిర్మాణానికి 3 కోట్ల 16 లక్షల రూపాయలు విరాళాల ద్వారా అందించారు.

– ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాల్ అమ్మవారి ఉప ఆలయాలు నిర్మించనున్నారు.

– ఆలయం చుట్టూ ప్రహరీ గోడ, పోటు, ఆఫీసు, స్టోర్ రూము తో పాటు భక్తులకు సదుపాయంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది