NAAC PEER TEAM TO VISIT SGS COLLEGE- JEO(E&H) _ ఎస్జీఎస్ కాలేజీకి న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ కోసం సమష్టి గా పని చేయాలి – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 17 NOVEMBER 2022:  The NAAC Peer Group will visit TTD-run Sri Govindaraja Swamy(SGS) College on November 22 and 23, said TTD JEO for Education and Health Smt Sada Bhargavi.

 

During her inspection to the college on Thursday,  she said, on the lines of SPWDPG and SV Arts college which were recently awarded NAAC A+ grade will visit the SGS college too during next week.

 

In connection with this, the JEO inspected the ongoing development works in the college, classrooms, laboratory, cleanliness and hygiene in the premises etc. and made valuable suggestions to the officials and faculty concerned.

 

Earlier, the SGS Walkers’ Association has felicitated 16 students who exhibited their skills awarded them with cash prize over the hands of JEO.

 

Devasthanams Education Officer Sri Bhaskar Reddy, DyEO Sri Govindarajan, SE Sri Venkateswarulu, DFO Sri Srinivasulu, EE Sri Manoharam, GM IT Sri Sandeep, Principal of the college Sri Venugopal Reddy, Walkers Association Chief Sri Prabhakar Reddy were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్జీఎస్ కాలేజీకి న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ కోసం సమష్టి గా పని చేయాలి – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 17 నవంబర్, 2022: ఎస్ జి ఎస్ కాలేజీకి న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ గుర్తింపు రావడానికి సమిష్టిగా పనిచేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులు ఆదేశించారు. కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆమె పరిశీలించారు. కళాశాలలోని తరగతి గదులు, అన్ని విభాగాల ల్యాబులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జేఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, ఎస్పీ డబ్ల్యు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ఇటీవలే న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ లభించిందని చెప్పారు. ఎస్జీఎస్ కళాశాల తొలిసారి న్యాక్ గుర్తింపు కోసం వెళ్తున్న నేపథ్యంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందంతోపాటు టీటీడీ లోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించేలా ఏర్పాటు చేయాలన్నారు.

అంతకుముందు కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది విద్యార్థిని విద్యార్థులకు శ్రీ గోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ ప్రకటించిన నగదు బహుమతులను శ్రీమతి సదా భార్గవి అందజేశారు. బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను ఆమె ఈ సందర్భంగా అభినందించారు.

డిఇవో డాక్టర్ భాస్కర్ రెడ్డి , ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ , డిఎఫ్వో శ్రీ శ్రీనివాస్, ఈ ఈ శ్రీ మనోహరం , ఐటి జనరల్ మేనేజర్ శ్రీ సందీప్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, శ్రీ గోవిందరాజ స్వామి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.