ఎస్వీ బాలమందిరంలో ‘సదాచారం’ తరగతులు ప్రారంభం

ఎస్వీ బాలమందిరంలో ‘సదాచారం’ తరగతులు ప్రారంభం

తిరుపతి, ఏప్రిల్‌  25, 2013: తితిదే ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర బాలమందిరం విద్యార్థులకు నెల రోజుల పాటు నిర్వహించనున్న సదాచారం శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి.

ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌ఈ-2 శ్రీ సుధాకరరావు ప్రసంగిస్తూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సదాచారాలను పాటిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. సదాచారాలను పాటించి మహాత్మునిగా ఎదిగిన గాంధీ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ శిక్షణ తరగతుల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథిదేవోభవ, ఆచార్యదేవోభవ, పరోపకారం, సమయపాలన, మానవీయమర్యాదలు, మహర్షుల జీవితచరిత్రలు, ఇష్టపడి చదవడం, దయ, అహింస లాంటి అంశాలను విద్యార్థులకు బోధించనున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలమందిరం ఏఈఓ శ్రీమతి వి.ఆర్‌.శాంతి, సూపరింటెండెండ్‌ శ్రీ సుధాకర్‌, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కో-ఆర్డినేటర్‌ శ్రీ చెన్నకేశవులు నాయుడు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.